Ileana D’Cruz: తన బాడీ పార్ట్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఇలియానా..

  • Published By: sekhar ,Published On : October 2, 2020 / 05:47 PM IST
Ileana D’Cruz: తన బాడీ పార్ట్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఇలియానా..

Updated On : November 10, 2020 / 4:56 PM IST

Ileana D’Cruz: ఫస్ట్ సినిమాతోనే తన సన్నని నున్నని రింగురోడ్ లాంటి నడుమొంపులతో కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టింది గోవా బ్యూటీ ఇలియానా. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన ఇల్లీ బేబి తర్వాత బాలీవుడ్ వెళ్లింది. కెరీర్ పీక్‌లో ఉండగా పీకల్లోతు ప్రేమతో పాటు, ప్రొఫెషన్‌ను సైతం పక్కన పెట్టేంత సహజీవనంలో మునిగితేలింది.


తర్వాత బ్రేకప్, డిప్రెషన్ వంటి కారణాలతో తన ఫిజిక్‌పై సరిగా ఫోకస్ పెట్టలేదు. కొద్ది కాలంగా అమ్మడు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టింది. రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేస్తూ మునుపటి రూపం సొంతం చేసుకుంది.. ఇలియానా లేటెస్ట్ ఇన్‌స్టా పోస్ట్‌లో త‌న శ‌రీర సౌష్ట‌వం గురించి ఇత‌రులు ఏమ‌నుకుంటున్నారోన‌ని తెగ ఇబ్బంది ప‌డ్డ‌ట్లు చెప్పుకొచ్చింది.

Ileana D'Cruz

‘‘నేను బయట వారికి ఎలా క‌న‌ప‌డుతున్నానోన‌ని బాధప‌డుతుండేదాన్ని. నా హిప్ చాలా వెడ‌ల్పుగా ఉంటాయ‌ని అనుకునేదాన్ని. నా తొడ‌లు చాలా పెద్ద‌విగా అనిపించేవి. నా న‌డుము స‌న్న‌దిగా ఉండేది కాదని, నా వ‌క్షోజాలు అనుకున్నంత పెద్ద‌వి కావని, నా ఉద‌రం చ‌దునుగా లేద‌ని, నా వెనుక‌భాగం పెద్ద‌దిగా ఉంద‌ని, నా భుజాలు బ‌ల‌హీనంగా ఉంటాయని, ముక్కు నేరుగా లేద‌ని, పెదాలు అందంగా లేవ‌ని, నేను ఎత్తుగా లేన‌ని బాధ‌ప‌డుతుండేదాన్ని.


నేను స్మార్ట్‌గా, ప‌ర్ఫెక్ట్‌గా లేద‌ని అనుకుంటుండేదాన్ని. అయితే నేను ఎప్పుడూ ప‌రిపూర్ణంగా ఉండాల‌ని అనుకోలేదు. నాలోని ప్ర‌తి మ‌చ్చ‌, భ‌యంను వ‌దిలి న‌న్ను నేను మ‌లుచుకున్నాను. నా అందం నాదే అని భావించాను. ప్ర‌పంచం అందం అని అనుకునేదాని గురించి ఆలోచించి నేనెందుకు ఆగాలి. అందులో ఇమిడిపోవాల‌ని నేను ఎందుకు ప్ర‌య‌త్నించాలి అని ఆలోచించి ఆగాను. నాకు నేనుగా నిల‌బ‌డ్డాను’’.. అంటూ ఇలియానా షేర్ చేసిన స్ఫూర్తిదాయకమైన సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CFzTPQHA7UN/?utm_source=ig_web_copy_link