Ileana: తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన ఇలియానా..

గోవా బ్యూటీ ఇలియానా తల్లి కాబోతున్నట్లు ప్రకటించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

Ileana To Be A Mother Soon

Ileana: గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్‌లో దేవదాస్, పోకిరి సినిమాలతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్‌గా నిలవడంతో, అమ్మడు కెరీర్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఇక వరుస సినిమాలతో చాలాకాలం టాలీవుడ్‌ను ఏలింది ఈ బ్యూటీ. అయితే, బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ, అక్కడ బిజీ కావడంతో టాలీవుడ్ సినిమాలను అమాంతం తగ్గించేసింది. ఇప్పుడు కెరీర్ ఫేడవుట్ అవడంతో, వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. అయితే, తాజాగా ఆమె తల్లి కాబోతున్నట్లు ప్రకటించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

Ileana D’Cruz : సినిమాల్లో ఛాన్స్‌లు నిల్.. ఆల్బమ్ సాంగ్స్‌తో స్టార్ హీరోయిన్..

ఇలియానా గతంలో ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూను పెళ్లాడింది. అయితే వారు చాలా తక్కువ సమయంలోనే విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తరువాత ఇలియానా సింగిల్‌గానే ఉంటోంది. సోషల్ మీడియాలో నిత్యం ఫోటోషూట్స్‌తో బిజీగా ఉంటూ, అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది. కాగా, తాజాగా తాను తల్లి కాబోతున్నట్లు ఇలియానా తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. అడ్వెంచర్ మొదలైంది అనే క్యాప్షన్ ఉన్న టీ-షర్ట్ ఫోటోతో పాటు, తన మెడలోని ‘మామా’ అనే పదం ఉన్న చైన్ ఫోటోను షేర్ చేసింది.

Ileana D’Cruz : హాస్పిటల్ బెడ్‎పై హీరోయిన్ ఇలియానా..

ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే, సింగిల్‌గా ఉంటున్న ఇలియానా తల్లి కానుండటంతో.. ఆమె బిడ్డకు తండ్రి ఎవరా అని అభిమానులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఆమె బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో రిలేషన్‌లో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ, ప్రస్తుతం ఇలాంటి విషయాలను పక్కనబెట్టి, తాను తల్లి కాబోతున్నాననే విషయాన్ని ఆమె ఆస్వాదిస్తోంది.