Ileana D’Cruz : సినిమాల్లో ఛాన్స్‌లు నిల్.. ఆల్బమ్ సాంగ్స్‌తో స్టార్ హీరోయిన్..
రెండో సినిమాకే ఇండస్ట్రీ హిట్టుని అందుకొని టాలీవుడ్ నెంబర్ వన్ పొజిషన్ ని ఎంజాయ్ చేసిన ఇలియానా (Ileana D'Cruz) ప్రస్తుతం అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంది.

Ileana DCruz album song Sab Gazab with Goldkartz Badshah
Ileana D’Cruz : టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఇలియానా (Ileana D’Cruz) ప్రస్తుతం అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంది. రామ్ నటించిన దేవదాసు (Devadasu) సినిమాతో వెండితెరకు పరిచయమైన ఇలియానా.. రెండో సినిమా మహేష్ బాబుతో (Mahesh Babu) నటించే అవకాశం అందుకుంది. పూరీజగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి (Pokiri) సినిమాలో హీరోయిన్ గా నటించి రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ హోదాని అందుకుంది.
Squid Game : నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ సిరీస్ రీమేక్.. ఏ భాషలోకో తెలుసా?
ఆ తరువాత రవితేజ, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు సరసన కూడా నటించి నెంబర్ వన్ పొజిషన్ ని ఎంజాయ్ చేసింది. తెలుగులోనే సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఇలియానా.. తమిళంలో ఒక రెండు సినిమాలు చేసింది. అయితే కొన్నాళ్లకు సౌత్ లో ఛాన్స్ లు తగ్గడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. ప్రస్తుతం అక్కడ కూడా పెద్దగా ఛాన్స్ లు అందడం లేదు. దీంతో ఆల్బమ్ సాంగ్స్ తో ఆడియన్స్ ముందుకు వస్తుంది.
Dil Raju : దిల్ రాజు పాన్ ఇండియా టార్గెట్.. సౌత్ సినిమాలతోనే..
ఈ క్రమంలోనే ప్రముఖ పాప్ సింగర్స్ గోల్డ్ కర్ట్జ్ (Goldkartz), బాద్‌షా (Badshah) తో కలిసి Sab Gazab అనే పాటలో చిందేసింది. ఒకప్పుడు జీరో సైజ్ నడుముని పరిచయం చేసిన ఇలియానా ఈ పాటలో బొద్దుగా కనిపించింది. ఇక పాట విషయానికి వస్తే క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. గతంలో కూడా ఇలియానా రెండు ఆల్బమ్ సాంగ్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోషూట్ లతో హీటెక్కిస్తోంది.