ఎటువంటి సినీ నేపథ్యం లేకున్నా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి విలన్‌గా, హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు, యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్.. కెరీర్ ప్రారంభంలో విలన్ వేషాలు వేసినా.. ‘కమాండో’ సిరీస్‌తో హీరోగా మారడు. తన స్టైల్ యాక్షన్ అండ్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
యువ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో బంధుప్రీతి గురించి ఏ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయో తెలిసిందే. నెపోటిజంపై తాజాగా విద్యుత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నెపోటిజం, సినిమా ఛాన్సులు ఏమో గానీ, మేం చేసిన పనికి కనీసం ఓ ప్రశంస కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి వాటికి ముందుగా సిద్ధపడే పరిశ్రమలోకి వచ్చానని చెప్పుకొచ్చాడు. తన స్నేహితుల వల్లే తను పరిశ్రమలో సర్వై కాగలుగుతున్నానని కూడా అన్నాడు.
‘‘సినీ పరిశ్రమలో నువ్వు బయటి వ్యక్తివి అని తెలిపే సంఘటనలు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. ఈ వ్యవస్థే అంత. దీన్ని ఎవరూ ఖండించలేరు. కానీ ఏం చేస్తాం.. నేను మార్చాలనుకుంటుంది ఒకే ఒక్కటి.. ఎవరూ కూడా ఏ మనిషినీ పట్టించుకోకుండా ఉండకూడదు. వారు చూసిన ప్రతి దానిని అభినందించాలి. దీనికి నెపోటిజంకి సంబంధం లేదు. కేవలం మంచి మనిషిగా చూడాలి. ఎవరైనా ఏదైనా పని చేస్తే వారికి గుర్తింపు ఇవ్వాలి’’ అన్నాడు.