Site icon 10TV Telugu

Sudheer – Imanvi : సుడిగాలి సుధీర్ సినిమా రిజెక్ట్ చేసి.. ప్రభాస్ సినిమాకు ఓకే చెప్పిన ఇమాన్వి..

Imanvi Rejected Sudigali Sudheer Movie and said ok to Prabhas Movie Getup Srinu Comments goes Viral

Imanvi Rejected Sudigali Sudheer Movie and said ok to Prabhas Movie Getup Srinu Comments goes Viral

Sudheer – Imanvi : ప్రభాస్ ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో ఇమాన్వి అనే డ్యాన్సర్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. సోషల్ మీడియాలో తన డ్యాన్స్ తో బాగా పాపులర్ అయింది. యూట్యూబ్ లో కూడా పలు డ్యాన్స్ వీడియోలతో అలరించింది ఇమాన్వి.

అసలు సినిమాల్లో నటించని ఓ కొత్త అమ్మాయికి డైరెక్ట్ ప్రభాస్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇమాన్వి అదృష్టం బాగుంది అనుకున్నారు. అయితే ఇమాన్విని హను రాఘవపూడి కంటే ముందే సుడిగాలి సుధీర్ తన సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామని ప్రయత్నించాడట.

Also Read : Tollywood Stars : మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్స్.. ఈ వీడియో చూసారా..?

ఇటీవల గెటప్ శ్రీను ఓ షోలో మాట్లాడుతూ.. ఇటీవల ప్రభాస్ సినిమాలో ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారు కదా. సుధీర్ తన గోట్ సినిమాలో ఆ అమ్మాయిని ముందే తీసుకుందాం అనుకున్నాడు. సోషల్ మీడియాలో రీల్స్ చూసి ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అని ఆమెని కాంటాక్ట్ అయ్యారు. హీరోయిన్ గా ఒప్పించడానికి ప్రయత్నించారు కానీ కుదరలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రభాస్ సినిమాలో చేస్తుంది అని సుధీర్ కి చెప్పగానే షాక్ అయ్యాను అన్నాడు అని తెలిపారు. దీంతో గెటప్ శ్రీను వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

సుడిగాలి సుధీర్ సినిమాలో హీరోయిన్ ఆఫర్ వచ్చినా ఇమాన్వి రిజెక్టు చేసి ప్రభాస్ పెద్ద హీరో కాబట్టే ఓకే చెప్పిందేమో అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సుధీర్ గోట్ సినిమాలో తమిళ భామ దివ్యభారతి హీరోయిన్ గా నటించింది.

Exit mobile version