మిలింద్ సోమన్ నపుంసకుడా..! మరో కొత్త ప్రయత్నంలో మోడల్

MILIND SOMAN: మిలింద్ సోమన్ మళ్లీ షూటింగ్ లలోకి వచ్చేశాడు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అయిన జీ5, ఏఎల్టీ బాలాజీలో స్ట్రీమింగ్ అయ్యే పౌరష్‌పూర్‌లో విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. ఓ చారిత్రక రాజ్యం గురించి చెప్పే పాత్రలో రాజకీయాలు, లింగ బేధాల అంశంగా స్టోరీ రూపొందనుంది. ఈ క్రమంలో తన ఫస్ట్ లుక్ ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్టు చేశాడు మిలింద్ సోమన్.

థర్డ్ జెండర్ (నపుంసకుడి) పాత్రను పోషిస్తున్నాడు మిలింద్. ‘ఇంతకుముందెవ్వరూ ఇలాంటి పాత్రను పోషించి ఉండరు. పారష్‌పూర్‌లో మూడో లింగం గురించి పవర్ ఫుల్ పోరాటం గురించి చెప్పే ప్రయత్నం ఇది. తెలివితో పాటు, ప్రేమ మరిన్ని షేడ్స్ చూపించగల పాత్ర ఇది’ అని రాసి పోస్టు చేశాడు.



ఓ కత్తి పట్టుకున్న మిలింద్ ఫొటోకు బ్యాక్ గ్రౌండ్ లో కాస్త గ్రాఫిక్స్ యాడ్ చేసి రిలీజ్ చేసింది యూనిట్. అందులో ముక్కుపుడక పెట్టుకుని, బంగారపు నగలు ధరించి చొక్కా లేకుండా కనిపించాడు మిలింద్. దానికి ఆల్ట్ బాలాజీ హెడ్ ఏక్తా కపూర్ మీరు అద్భుతంగా కనిపిస్తున్నారంటూ కామెంట్ చేశాడు.

ఇందులో Shilpa Shinde, Shaheer Sheikh, Sahil Salathia, Annu Kapoor లీడ్ రోల్స్ లో కనిపించనుండగా Aditya Lal, Poulomi Das, Anant Joshi, Flora Saini కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదే సిరీస్ కు సంబంధించి అంతకంటే ముందు విడుదల చేసిన టీజర్లో పౌరష్‌పూర్ రాజ్యంలో లింగ వివక్షతలను ఎదురించి కలలను నిజం చేసుకునే కథాంశం ఇది అంటూ గ్రాండ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు.