Telugu Indian Idol : ఇండియన్ ఐడల్ స్టేజి పై పాకిస్తాన్ బోర్డర్ సైనికుడు పాట.. వైరల్ అవుతున్న వీడియో!

ప్రతి ఒక్కరిలో ఏదొక టాలెంట్ ఉంటుంది. అయితే ఆ టాలెంట్ ని నలుగురికి చూపించడానికి కొంతమందికి వారి బాధ్యతలు అడ్డు వస్తాయి. లైఫ్ లో ఒక్కసారి అయినా ఒక్క ఛాన్స్ వస్తే చాలు, దానిని నలుగురికి చూపించడానికి ఎదురు చూస్తుంటారు. అటువంటి ఒక ఛాన్స్ భారత్ - పాకిస్థాన్ బోర్డర్ లో విధులు నిర్వర్తించే ఒక బీఎస్ఎఫ్ జవాన్ కి దొరికింది.

India-Pakistan border BSF Jawan attended the Telugu Indian Idol auditions

Telugu Indian Idol : ప్రతి ఒక్కరిలో ఏదొక టాలెంట్ ఉంటుంది. అయితే ఆ టాలెంట్ ని నలుగురికి చూపించడానికి కొంతమందికి వారి బాధ్యతలు అడ్డు వస్తాయి. లైఫ్ లో ఒక్కసారి అయినా ఒక్క ఛాన్స్ వస్తే చాలు, దానిని నలుగురికి చూపించడానికి ఎదురు చూస్తుంటారు. అటువంటి ఒక ఛాన్స్ భారత్ – పాకిస్థాన్ బోర్డర్ లో విధులు నిర్వర్తించే ఒక బీఎస్ఎఫ్ జవాన్ కి దొరికింది. ఇటీవల కాలంలో ఓటిటి కల్చర్ ఆడియన్స్ కి చాలా దగ్గర అవుతూ వస్తుంది. దీంతో పలు సంస్థలు యంగ్ టాలెంట్స్ ని ప్రోత్సహిస్తూ అవకాశాలు కల్పిస్తున్నారు.

Sobhita Dhulipala : బ్యాక్‌గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు అన్నారు.. అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాను.. శోభిత వ్యాఖ్యలు..

ఈ క్రమంలోనే ఆహాలో ఇండియన్ ఐడల్ అనే ఒక సింగింగ్ కాంపిటీషన్ ప్రసారం అవుతుంది. ఈ షోలో సంగీతం పై ఆసక్తి ఉండి, వారి పాటని నలుగురికి వినిపించడానికి ఎదురు చూసే వారికీ అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ చక్రపాణి తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్‌కు హాజరయ్యారు. ఈ ఆడిషన్ లో జవాన్ చక్రపాణి.. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమాలోని ‘ఘల్ ఘల్’ సాంగ్ ని పాడాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోని ఆహా టీం రిలీజ్ చేసింది.

ఈ ప్రోమోలో.. తనకు సంగీతం తెలియకపోయినా డ్యూటీలో ఉన్న సమయంలో బోర్డర్‌లో పాటలు పాడుతూ నేర్చుకున్నానని చెప్పాడు. ఈ షోకి న్యాయనిర్ణేతలుగా ఎస్ ఎస్ థమన్, కార్తీక్, గీతామాధురి వ్యవహరిస్తున్నారు. మొబైల్ నెట్‌వర్క్ కూడా లేని ప్రదేశాలలో సంగీతం నేర్చుకోవడం గ్రేట్ అంటూ ఎస్ ఎస్ థమన్ అభినందించాడు. ఇక కార్తీక్, చక్రపాణి పాడిన పాటకు ఫిదా అయ్యిపోయి తనని సెలెక్ట్ చేస్తున్నట్లు ఓకే చెప్పాడు. అయితే, చక్రపాణి మాత్రం నిరాకరించాడు. ఎందుకంటే తనకు పెండింగ్‌ లీవ్స్ అన్ని అయిపోయినట, మళ్ళీ తిరిగి సరిహద్దుకు వెళ్లే టైం వచ్చింది అంటూ తెలియజేశాడు.

ఇక చక్రపాణి మాటలు విన్న ముగ్గురు జడ్జ్స్.. దేశం పట్ల చక్రపాణికి ఉన్న నిబద్ధతకు లేచి నిలబడి అభివాదం చేశారు. తెలుగు ఇండియన్ ఐడల్ వేదికపైకి డిఫెన్స్‌కు చెందిన ఒకరు వచ్చి పాట పాడడం చాలా గౌరవంగా ఉందంటూ థమన్ పేర్కొన్నాడు. మీ ఉన్నతాధికారులతో ఎవరితోనైనా మాట్లాడిస్తే షోలోకి నువ్వు పాల్గొడం కుదురుతుందా? అని థమన్ అడగడంతో ప్రోమో ముగిసింది. మరి ఆ జవాన్ కి అవకాశం దక్కిందా? లేదా? అంటే ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక తెలుసుకోవాల్సిందే.