Nitin Chandrakant Desai : ఆస్కార్ వేదికపై.. దివంగత ఇండియన్ ఆర్ట్ డైరెక్టర్‌ జ్ఞాపకాలు..

ఆస్కార్ వేదికపై దివంగత ఇండియన్ ఆర్ట్ డైరెక్టర్‌ జ్ఞాపకాలు కనిపించడం భారతీయ ఆడియన్స్ ని ఆనందపరుస్తుంది.

Indian art director Nitin Chandrakant Desai memories at 96th oscar award event

Nitin Chandrakant Desai : వరల్డ్ వైడ్ మూవీ మేకర్స్ అంతా ఎదురు చూసే ఆస్కార్ అవార్డుల వేడుక.. ఈ ఏడాది కూడా ఘనంగా జరిగింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో 96వ అకాడమీ అవార్డుల పురస్కారం గ్రాండ్ గా జరిగింది. గత ఏడాది ఆస్కార్ లో మన ఇండియన్ సినిమాలు బాగానే సందడి చేసాయి. ఈ ఏడాది మన సినిమాలు నామినేషన్స్ లో లేకున్నా.. అక్కడ వినిపించి సందడి చేసాయి.

గత ఏడాది ఆస్కార్ ని గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’కి సంబంధించిన విజువల్స్ ని ఈ ఏడాది ఆస్కార్ లో కూడా ప్లే చేయడం ఇండియన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ చిత్రంతో పాటు ఇండియన్ ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్ ‘నితిన్ చంద్రకాంత్ దేశాయ్’కి సంబంధించిన విజువల్స్ కూడా ఆస్కార్ వేదిక పై కనిపించాయి. ఆర్ట్ డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా ఎంతో పేరుని సంపాదించుకున్న నితిన్ దేశాయ్.. గత ఏడాది ఆగష్టులో మరణించారు.

Also read : Upasana : అయోధ్యలో అపోలో హాస్పిటల్ ప్రారంభించిన ఉపాసన.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో..

ఇక ఈయనను గుర్తు చేసుకుంటూ ఆయన వర్క్ కి సంబంధించిన ఫిలిమ్స్ ని ఈ ఏడాది ఆస్కార్ వేదిక పై ప్లే చేసారు. హాలీవుడ్ మేకర్స్ తో పాటు నితిన్ దేశాయ్ కి సంబంధించిన ఆర్ట్ వర్క్స్ ని కూడా ప్లే చేయడం.. నితిన్ దేశాయ్ కి మాత్రమే కాదు, ఇండియన్స్ కి కూడా గౌరవం కలిగిస్తుంది. ఇక ఈ వీడియో ప్లే చేయడం పట్ల ఇండియన్ మేకర్స్ మరియు ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా నితిన్ దేశాయ్.. లగాన్, దేవదాస్, జోధా అక్బర్ వంటి పీరియాడిక్ మూవీస్ లో తన ఆర్ట్ వర్క్ తో మాయ చేసారు. ఈ చిత్రాలతో పాటు ఎన్నో సినిమాలకు తన అద్భుతమైన ఆర్ట్ తో గ్రాండియర్ ని తీసుకు వచ్చారు. ఇక అద్భుతమైన ఆర్ట్ వర్క్ కి గాను నాలుగు నేషనల్ అవార్డులను, మూడు ఫిలిం ఫేర్ అవార్డులను, ఒక ఐఫా అవార్డుతో పాటు పలు ప్రముఖ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు