Upasana : అయోధ్యలో అపోలో హాస్పిటల్ ప్రారంభించిన ఉపాసన.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో..

ఒక భార్యగా చరణ్ అడుగుల్లో తోడుగా నిలుస్తూనే, బిజినెస్ ఉమెన్ గా కూడా ఉపాసన సక్సెస్‌ఫుల్ సాగుతూ ఎంతోమంది ఆడవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా..

Upasana : అయోధ్యలో అపోలో హాస్పిటల్ ప్రారంభించిన ఉపాసన.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో..

Ram Charan wife Upasana starts apollo service in Ayodhya

Updated On : March 12, 2024 / 7:35 AM IST

Upasana : రామ్ చరణ్ సతీమణి గానే కాకుండా ఒక బిజినెస్ ఉమెన్‌గా కూడా ఉపాసన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఒక భార్యగా చరణ్ అడుగుల్లో తోడుగా నిలుస్తూనే, బిజినెస్ ఉమెన్ గా కూడా సక్సెస్‌ఫుల్ సాగుతూ ఎంతోమంది ఆడవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవలే తన అత్తమ్మ కొణిదెల సురేఖతో ఫుడ్ బిజినెస్ ని స్టార్ట్ చేయించి ఉత్తమ కోడలు అనిపించుకున్నారు.

ఇక ఇప్పుడు పుట్టినిల్లు వంతు వచ్చింది. తన పుట్టినిల్లుకి చెందిన అపోలో హాస్పిటల్స్ కొత్త బ్రాంచ్ ని అయోధ్యలో ఓపెన్ చేసారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్టని రామ్ చరణ్ మరియు అత్తమామలు చిరంజీవి, సురేఖతో కలిసి దర్శించుకున్న ఉపాసన.. తాజాగా తన పుట్టినింటి వారితో కలిసి ఆ రాముడుని దర్శించుకున్నారు. అపోలో ఫౌండర్ మరియు తనకి తాత అయిన ప్రతాప్ రెడ్డితో కలిసి ఉపాసన అయోధ్య రాముడిని దర్శించుకున్నారు.

Also read : Kiran Abbavaram : మొదటి సినిమా హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్..

అయితే రాముడిని దర్శించుకోవడమే కాదు, అయోధ్యలో అపోలో హాస్పిటల్ సర్వీస్ ని కూడా ప్రారంభిస్తూ.. అక్కడికి వచ్చే భక్తులకు ఎమర్జెన్సీ కేసులు ఫ్రీగా సర్వీస్ చేస్తామని తెలిపారు. అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని కూడా కలుసుకొని.. యూపీలో అపోలో సర్వీస్ లాంచ్ గురించి తెలియజేసారు. అనంతరం తన తాత ప్రతాప్ రెడ్డి లెగసీని తెలియజేసే ‘ది అపోలో స్టోరీ’ బుక్ ని కూడా యోగి ఆదిత్యనాథ్ కి అందజేశారు.

Ram Charan wife Upasana starts apollo service in Ayodhya

రానా దగ్గుబాటి సాయంతో ఉపాసన ఈ బుక్ ని రెడీ చేయించారు. ఈ పుస్తకంలో ప్రతాప్ రెడ్డి లెగసీ గురించి, అపోలో హాస్పిటల్స్ చరిత్ర, అవి ఎదిగిన విధానం, ఎదుర్కున్న సవాళ్లు.. సంబంధించిన అంశాలను తెలియజేసారు. ఇక భవిషత్తులో కుదిరితే ప్రతాప్ రెడ్డి లైఫ్ స్టోరీని బయోపిక్ గా కూడా తీసుకు రావొచ్చని ఉపాసన తెలియజేసారు.