Indraja
Indraja : ఒకప్పటి హీరోయిన్, నటి ఇంద్రజ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ మరో పక్క జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ.. లాంటి పలు టీవీ షోలతో అలరిస్తుంది. తాజాగా ఇంద్రజ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.(Indraja)
ఇంద్రజ తన తల్లి గురించి మాట్లాడుతూ.. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మకు హార్ట్ సమస్య ఉంది. హార్ట్ పేషంట్. అమ్మకు సర్జరీ జరిగిన సమయంలో నా చేతిలో డబ్బులు లేవు. అప్పుడు ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇది మా అమ్మ పరిస్థితి డబ్బులు కావాలని అడిగినా ఇవ్వలేదు. చాలా మందిని అడిగాను, డబ్బుల కోసం బతిమాలాను. నాకు ఎవరూ హెల్ప్ చేయలేదు.
Also Read : Indraja : వల్గర్ డ్రెస్ లు వేసేవాళ్లపై ఇంద్రజ హాట్ కామెంట్స్ వైరల్.. జారిపోతాయేమో..
హాస్పిటల్ వాళ్ళే మా పరిస్థితి చూసి ఒక డాక్టర్, ఒక మేడం పర్లేదు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వండి అని ఆపరేషన్ చేసారు. వాళ్లకు జీవితాంతం రుణపడి ఉంటారు. చెన్నైలో మా ఇంటికి కొంచెం దూరంలో మురుగన్ ఆలయం ఉంది. మా అమ్మ ఎప్పుడూ అక్కడికి తీసుకువెళ్ళమని అడిగేది. నేను తర్వాత తర్వాత అంటూ ఖాళీ లేదని తీసుకెళ్తాను అని వాయిదా వేస్తూ వచ్చాను. ఓ రోజు షూట్ లో ఉంటే మా సిస్టర్స్ త్వరగా రా అక్క అని అమ్మ గురించి చెప్పారు. ఆమె హాస్పిటల్ లో ఉంది.
ఆ రోజే మా అమ్మ మధ్యాహ్నం చనిపోయింది. నేను మా అమ్మ ఏం అడిగినా చేసాను. ఇదొక్కటే చేయలేకపోయాను. మా అమ్మ ఆశ తీర్చలేకపోయాను అని గిల్ట్ ఫీల్ అవుతాను ఇప్పటికి. పక్కన ఉన్న టెంపుల్ కి తీసుకెళ్లలేకపోయాను అని చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడు చెయ్యాలనుకున్నా మా అమ్మ లేదు. మా అమ్మ కనిపిస్తే సారీ చెప్తా. టైట్ గా హగ్ చేసుకోవాలని ఉంది మా అమ్మను. చివరి నిమిషంలో డాక్టర్స్ నీళ్లు కూడా తాగనివ్వలేదు, తాగకూడదు అన్నారు. తులసి తీర్థం అయినా పోద్దామనుకున్నా. పోస్తే బతికేదేమో అని డాక్టర్స్ ని బతిమాలాను. కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మనకు ఎంతమంది ఉన్నా తల్లితండ్రులు పోతే మనం అనాథలమే అంటూ ఎమోషనల్ అయింది.