×
Ad

Indraja : వల్గర్ డ్రెస్ లు వేసేవాళ్లపై ఇంద్రజ హాట్ కామెంట్స్ వైరల్.. జారిపోతాయేమో..

తాజాగా ఇంద్రజ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మాయిలు వేసుకునే డ్రెస్ ల గురించి కామెంట్స్ చేసారు.(Indraja)

Indraja

Indraja : ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుసగా సినిమాలు చేస్తుంది. మరో పక్క జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ.. లాంటి పలు టీవీ షోలతో అలరిస్తుంది. తాజాగా ఇంద్రజ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మాయిలు వేసుకునే డ్రెస్ ల గురించి కామెంట్స్ చేసారు.(Indraja)

ఇంద్రజ మాట్లాడుతూ.. నా ఇష్టం.. నేను నాకు నచ్చిన డ్రెస్ వేసుకున్నాను, నువ్వు ఎవరు దాని గురించి కామెంట్ చేయడానికి, నువ్వెవరు అనడానికి అని ప్రశిస్తున్నారు. నువ్వు నీ ఇష్టం అని పబ్లిక్ గా బట్టలు వేసుకొని రావడం, పబ్లిక్ మీడియాలో లో నీ ఫోటోలు, వీడియోలు పెట్టడం నీకు ఎంత హక్కు ఉంది అంటున్నావో నువ్వేసుకున్న డ్రెస్ అభ్యంతకరంగా, వల్గర్ గా ఉన్నప్పుడు దాని గురించి కామెంట్ చేసే హక్కు కూడా వాళ్ళకే ఉంటుంది. పబ్లిక్ లో ఎలా ఉండాలి అని ఒకటి ఉంటుంది. ఇంట్లో ఉన్నట్టు, ఇంట్లో మాట్లాడినట్టు పబ్లిక్ లో ఉండదు, ఉండకూడదు. పబ్లిక్ లో ఎలా ఉండాలి అని ఒక కోడ్ ఉంటుంది. లేదు అది నీ ఇష్టం నేను వేసుకుంటాను అంటే ఓకే కానీ వేసుకున్నాక కామెంట్స్ చేయొద్దు అనే రైట్ నీకు లేదు.

Also Read : Nandamuri Hero : అప్పట్లో చిరంజీవితో నటించిన నందమూరి హీరో.. 35 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ.. ఈయనని గుర్తుపట్టారా?

అసభ్యకరంగా బట్టలు వేయకండి పబ్లిక్ లో. మీ పర్సనల్ స్పేస్ లో వేసుకోండి. కానీ పబ్లిక్ లో వేస్తే కామెంట్స్ చేస్తారు. అది తీసుకోడానికి రెడీ అయితేనే వేసుకోండి, అలా ఉండండి లేకపోతే వేసుకోవద్దు. చాలా సార్లు కొంతమంది డ్రెస్ లు చూసి అబ్బా ఇవేమి డ్రెస్ లు అని, అవి ఎప్పుడు జారిపోతాయో అని భయం వేస్తుంది. అలాంటి కాస్ట్యూమ్స్ లో వాళ్ళు కంఫర్ట్ గా ఎలా ఉంటారు అనిపిస్తుంది. కొంతమందిని చూసి మాములు జనాలు ఫాలో అవుతారు, మన పిల్లలు పాడయిపోతారు అనే భయం ఉంటుంది.

అందంగా ఉండాలి, ట్రెండింగ్ గా ఉండాలి కానీ ఛీ అనేలా, మన అవయవాలు కనపడేలా ఉండకూడదు మన కాస్ట్యూమ్స్. సెలబ్రిటీలు ఈ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండాలి. మిమ్మల్ని చూసి ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు కాబట్టి. డ్రెస్సులు వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయా అంటే కాదు కానీ పబ్లిక్ లో జనాల మధ్యలో ఉన్నప్పుడు డీసెంట్ గా ఉండాలి. మనల్ని ట్రీట్ చేసే విధానం మన బట్టల్లో కూడా ఉంటుంది అని తెలిపింది. దీంతో ఇంద్రజ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read : Annagaru Vostaru : కార్తీ ‘అన్నగారు వస్తారు’ ట్రైలర్ రిలీజ్.. సీనియర్ ఎన్టీఆర్ రిఫరెన్స్ తో.. ఇదేదో కొత్తగా ఉందే..