Nandamuri Hero : అప్పట్లో చిరంజీవితో నటించిన నందమూరి హీరో.. 35 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ.. ఈయనని గుర్తుపట్టారా?
ఒకప్పటి నందమూరి హీరో కూడా ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంతకీ ఈ హీరో ఎవరు అనుకుంటున్నారా?(Nandamuri Hero)
Nandamuri Hero
Nandamuri Hero : ఒకప్పటి హీరోలు, హీరోయిన్స్ ఇటీవల మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒకప్పటి నందమూరి హీరో కూడా ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంతకీ ఈ హీరో ఎవరు అనుకుంటున్నారా?(Nandamuri Hero)
ఈ హీరో పేరు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. ఈయన సీనియర్ ఎన్టీఆర్ సొంత తమ్ముడు నందమూరి త్రివిక్రమ్ రావు తనయుడు. అంటే సీనియర్ ఎన్టీఆర్ ఈయనకు బాబాయ్ అవుతారు. బాలకృష్ణకు తమ్ముడు వరుస అవుతాడు. కళ్యాణ్ చక్రవర్తి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించాడు.

కళ్యాణ్ చక్రవర్తి.. దొంగ కాపురం, ప్రేమ కిరీటం, ఇంటిదొంగ, అక్షింతలు, అత్తగారు స్వాగతం, రౌడీ బాబాయ్, మేనమామ, కృష్ణ లీల, తలంబ్రాలు, జీవనగంగ, మామ కోడలు సవాల్, లంకేశ్వరుడు.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. లంకేశ్వరుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించారు.
అయితే 1990 తర్వాత ఈయన సినిమాలు మానేశారు. అప్పట్లో కళ్యాణ్ చక్రవర్తి సోదరుడు హరిన్ ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అదే యాక్సిడెంట్ వీళ్ళ నాన్న, ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ రావు సివియర్ గా గాయాలపాలయి మంచాన పడ్డారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ బాధలతో సినిమా రంగాన్ని వదిలేసారు. చెన్నైలోనే నివాసం ఉంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నారు. మధ్యలో కబీర్ దాస్ అనే ఓ సినిమాలో చిన్న పాత్ర చేసారు.
మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రోషన్ సినిమా ఛాంపియన్ లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25 న రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా నుంచి కళ్యాణ్ చక్రవర్తి లుక్ రిలీజ్ చేసారు. ఈ ఫోటో చూసి అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయారు అని కామెంట్స్ చేస్తున్నారు నందమూరి అభిమానులు, నెటిజన్లు.

View this post on Instagram
