Ravi K Chandra
Tamara : మన తెలుగు సినిమా ‘బాహుబలి’ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఎదిగింది. ఇప్పుడు తీసే అన్ని సినిమాలని పాన్ ఇండియా దృష్టిలో పెట్టుకొని తీస్తున్నారు. కొన్ని సినిమాలు వేరే దేశాల నిర్మాణ సంస్థలతో కలిసి కూడా నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా ఎల్లలు దాటి ప్రపంచమంతటికి చెరువవుతుంది. తాజాగా ఓ తెలుగు నిర్మాణ సంస్థ ఫ్రాన్స్ కి చెందిన ఓ నిర్మాణ సంస్థతో కలిసి ఇంటర్నేషనల్ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు.
Bigg Boss 5 : విలన్స్ టీం నుంచి బిగ్ బాస్ లో కొత్త కెప్టెన్
తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన రవి కె.చంద్రన్ తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో కెమెరామెన్ గా పరిచయమయ్యారు. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమాకి కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ కెమెరామెన్ రవి కె.చంద్రన్ డైరెక్టర్ గా సినిమాని అనౌన్స్ చేసింది. రవి కె.చంద్రన్ గతంలో కూడా కొన్ని సినిమాలకి దర్శకత్వం వహించారు.
Film Festival : భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఎంపికైన ఏకైక తెలుగు సినిమా
తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ‘తమర’ అనే క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కించనున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిన్న ప్రకటించింది. ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ ని చూస్తుంటే ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమాగా అనిపిస్తుంది. ‘భీమ్లా నాయక్’ సినిమా అయిపోయాక ఈ ఇంటర్నేషనల్ సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడించి సినిమాని ప్రారంభిస్తారని తెలుస్తుంది.