Alia Bhatt Devara Song : ఎన్టీఆర్ ‘దేవర’.. అలియా ‘జిగ్రా’ ముచ్చట్లు.. వీడియో వైరల్

Alia Bhatt Devara Song : అలియా భట్ దేవర పాపులర్ సాంగ్ చుట్టమల్లె చుట్టేస్తాంది అనే పాటను చాలా క్యూట్‌గా పాడుతూ అలరించింది. అలియా పాట వినగానే ఎన్టీఆర్ కూడా వావ్ అనేశాడు. ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Internet impressed with Alia Bhatt's Telugu after she sings Chuttamalle from Devara Part 1

Alia Bhatt Devara Song : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. కొరటల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో సైఫ్ భైరా అనే విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు.

దేవర మూవీతో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇద్దరూ సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, ఈ సినిమా ప్రమోషన్ సమయంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా ఎన్టీఆర్‌తో కనిపించి సందడి చేశారు. వీరిద్దరి ఇంటర్వ్యూకి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అలియా నటించిన జిగ్రా మూవీ అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం అలియా రాగా, దేవరను ఎన్టీఆర్ ప్రమోట్ చేసేందుకు వచ్చారు. వీరిద్దరి ఇంటర్వ్యూకు దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ హోస్టుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ‘దేవర’, అలియా ‘జిగ్రా’ ముచ్చట్లతో ప్రేక్షకులను అలరించారు.

అలియా భట్ దేవర పాపులర్ సాంగ్ చుట్టమల్లె చుట్టేస్తాంది అనే పాటను చాలా క్యూట్‌గా పాడుతూ అలరించింది. అలియా పాట వినగానే ఎన్టీఆర్ కూడా వావ్ అనేశాడు. ఈ వీడియోను దేవర ఎక్స్ హ్యాండిల్ నుంచి షేర్ చేయగా వైరల్‌ అవుతోంది. దేవర పాటను తెలుగులో పాడినందుకు ఎన్టీఆర్ అభిమానులు కూడా అలియా భట్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చాలా క్యూట్‌గా పాడారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ మాదిరిగా అలియా పాడటం అభిమానులను ఆకట్టుకుంది. “తెలుగులో పాడే అవకాశం ఇవ్వొచ్చు కదా అని ఓ అభిమాని వ్యాఖ్యానించగా, “క్యూట్ సింగింగ్ అలియా” అంటూ మరొకరు కామెంట్ చేశారు. “ఏమన్నా పాడిందిగా. (ఆమె చాలా బాగా పాడారు)” అని మరో అభిమాని అభిప్రాయపడ్డారు. “అలియా భట్ మళ్ళీ తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకుంది” అంటూ వరుసగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలియాను తెగ పొగిడేస్తున్నారు.

కొరటాల దేవర పార్ట్ 1లో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ దేవరగా ద్విపాత్రాభినయం చేయగా, సైఫ్ భైరాగా, జాన్వీ తంగం పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. సినిమా కథ గురించి పెద్దగా ఏమీ తెలియనప్పటికీ, ట్రైలర్స్ సముద్రతీరంపై ఆధిపత్యం కోసం సాగే పోరాటాన్ని సూచిస్తున్నాయి.

అలియా వాసన్ బాలా జిగ్రా మూవీలో వేదాంగ్ రైనాతో కలిసి నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. విదేశీ జైలులో ఉన్న తన సోదరుడిని విడిపించేందుకు ఓ సోదరి చేసే పోరాటమే ఈ చిత్రం కథ. 

Read Also : ‘స‌రిపోదా శ‌నివారం’ డిలీటెడ్ సీన్ 3.. ఎస్‌జే సూర్య‌తో స‌త్య కామెడి