అశోక్ గల్లా ఫస్ట్‌లుక్ : మహేశ్ విషెస్

ప్రొడక్షన్ నెం:1 అనే వర్కింగ్ టైటిల్‌తో అశోక్ గల్లా ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు మూవీ యూనిట్..

  • Published By: sekhar ,Published On : November 10, 2019 / 04:42 AM IST
అశోక్ గల్లా ఫస్ట్‌లుక్ : మహేశ్ విషెస్

Updated On : November 10, 2019 / 4:42 AM IST

ప్రొడక్షన్ నెం:1 అనే వర్కింగ్ టైటిల్‌తో అశోక్ గల్లా ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు మూవీ యూనిట్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, పద్మావతిల కుమారుడు గల్లా అశోక్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. రీసెంట్‌గా ప్రొడక్షన్ నెం:1 అనే వర్కింగ్ టైటిల్‌తో అశోక్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. పర్ఫెక్ట్ హీరో లుక్‌లో అశోక్ ఆకట్టుకుంటున్నాడు.
నవంబర్ 10వ తేది ఆదివారం ఉదయం 11 గంటలకు రామానాయుడు స్టూడియోస్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి గల్లా, ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

Read Also : తెనాలి రామకృష్ణ BA.BL – ట్రైలర్

సూపర్‌స్టార్ కృష్ణ మరియు గల్లా అరుణ కుమారి సమర్పణలో, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.. సంగీతం : జిబ్రాన్, కెమెరా : రిచర్డ్ ప్రసాద్.