విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ Best Movies
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ బెస్ట్ మూవీస్..

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ బెస్ట్ మూవీస్..
ప్రముఖ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఏప్రిల్ 29 బుధవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో మరణించారు. కొన్నాళ్లుగా పెద్ద ప్రేగుకు సంబందించిన క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇర్ఫాన్, కొన్నాళ్లపాటు లండన్‌లో చికిత్స తీసుకుని కోలుకున్నారు. అయితే ఇటీవల తీవ్ర అనారోగ్యంతో కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరగా ఐసియులో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. పరిస్థితి మరింత విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.
కాగా ఇటీవల క్యాన్సర్ నుంచి కోలుకుని ‘అంగ్రేజీ మీడియం’ సినిమాలో నటించారు ఇర్ఫాన్ ఖాన్. ఈయన మొదటి సినిమా ‘సలామ్ బాంబే’(1988). తొలి సినిమాతోనే నటుడిగా మంచి పేరు దక్కించుకున్న ఇర్ఫాన్, ‘పాన్ సింగ్ తోమర్’ అనే సినిమాలో గొప్ప నటనకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. తన నటనతో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కాలు అందుకున్న ఇర్ఫాన్, అటు హాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసి మంచి పేరు సంపాదించారు.
తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో విలన్ పాత్రలో ఇర్ఫాన్ నటించారు. కాగా ఆయన హఠాన్మరణంతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ ఖాన్ తన నటనతో విలక్షణమైన నటుడిగా ప్రూవ్ చేసుకున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం..
The Warrior (2001)
Haasil (2003)
Maqbool (2004)
The Namesake (2006)
Yeh Saali Zindagi (2011)
Paan Singh Tomar (2012)
The Lunchbox (2013)
Talvar (2015)
Piku (2015)
Hindi Medium (2017)