PriyaBhavani Shankar : పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్ ప్రియా భవానీ శంకర్
Priya Bhavani Shankar : హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
- Thota Vamshi Kumar
- Updated on- November 11, 2026 / 01:23 PM IST
Irumudi Heroine PriyaBhavani Shankar got Married
PriyaBhavani Shankar : హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. నవంబర్ 11న ప్రియుడు రాజ్‌తో ఆమె వివాహం జరిగింది. అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త జంటకు నెటిజన్లు శుభకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రియా, రాజ్‌లకు కాలేజీ రోజుల నుంచే పరిచయం. సినిమాల్లో ప్రియా కెరీర్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ వీరిద్దరూ పదేళ్లకు పైగా డేటింగ్ చేస్తూ తమ బంధాన్ని స్థిరంగా కొనసాగిస్తున్నారు. ఈ జంట 2022లో తమ కలల ఇంటిని కొనుగోలు చేశారు. ఆ సమయంలో.. వారి పెళ్లి గురించిన వదంతులు వార్తల్లో నిలిచాయి, కానీ ఆ వేడుకలు తమ కొత్త ఇంటికి సంబంధించినవే తప్ప పెళ్లికి కాదని ప్రియ స్పష్టం చేసింది.
Manchu Lakshmi : మంచు లక్ష్మీ దీపావళి స్పెషల్ ఫోటోలు.. వైరల్..
2024 ఆగస్టులో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. ఆమె వారి సంబంధం గురించి మాట్లాడుతూ.. తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. రాజ్ వృత్తిరీత్యా డేటా అనలిస్ట్ అని సమాచారం.
ఇదిలా ఉంటే.. తమిళంలో అనేక చిత్రాల్లో ప్రియా భవానీ శంకర్ నటించింది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. సంతోష్ శోభన్ ‘కల్యాణం కమనీయం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైంది. దూత వెబ్ సిరీస్‌తో ఆకట్టుకుంది. ఇటీవల ఇరుముడి చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
