Mythri Movie Makers : 300 ఎకరాలు.. మైత్రీ మేకర్స్ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్టు!
టాలీవుడ్‌లో సినిమాలతోనే కాదు.. ఇప్పుడు స్టూడియో నిర్మాణంతోనూ సెన్సేషన్ క్రియేట్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ చూస్తోందా?(Mythri Movie Makers)
- Thota Vamshi Kumar
- Updated on- October 13, 2026 / 08:16 AM IST
Mythri Movie Makers Is Planning To Build A Huge Film Studio
Mythri Movie Makers : టాలీవుడ్‌లో సినిమాలతోనే కాదు.. ఇప్పుడు స్టూడియో నిర్మాణంతోనూ సెన్సేషన్ క్రియేట్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ చూస్తోందా?. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ దగ్గరలో ఏకంగా 300 ఎకరాల్లో భారీ ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రూ.కోటి రూపాయాలకు ఎకరం చొప్పున భూమి కేటాయింపు ప్రతిపాదన కూడా ఉందనే టాక్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇదే నిజమైతే..మైత్రీ మూవీ మేకర్స్ సినీ బిజినెస్ నెక్స్ట్ లెవల్‌కు చేరడం ఖాయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Anshu reddy : ఈ చిత్రం చూశారా? ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటి అన్షురెడ్డి ఫోటోలు వైరల్..
స్టూడియోనే కాదు..బిగ్ థియేటర్‌కు కూడా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో అత్యాధునిక IMAX స్క్రీన్‌తో భారీ థియేటర్ నిర్మించేందుకు కూడా మైత్రీ సంస్థ ప్లాన్ చేస్తోందంటూ మరో ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. ఒకవైపు భారీ స్టూడియో.. మరోవైపు ప్రీమియం థియేటర్.. ఇలా రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కితే హైదరాబాద్ సినీ రంగంలో కొత్త రేంజ్ హంగామా ఖాయమనే చర్చ జరుగుతోంది.
అయితే ఈ ప్రచారంపై మైత్రీ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించినట్లు ఇప్పటికే గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఫిల్మ్ స్టూడియో, థియేటర్ అంటూ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో టాక్ అయితే నడుస్తోంది. ఇది ఎప్పుడు గ్రౌండింగ్ అవుతుందో చూడాలి మరి.
