NTR: కర్ణాటక రత్న పురస్కానికి.. ఎన్టీఆర్ ఆహ్వానం వెనుక బీజేపీ రాజకీయ కోణం ఉందా?

పునీత్ రాజ్ కుమార్.. ఒక స్టార్ ఫామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చి, ఆ ఫ్యామిలీకే కాదు టోటల్ కన్నడకే పవర్ స్టార్ అనిపించుకున్నాడు. కాగా దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు 'కర్ణాటక రత్న' ప్రకటించగా.. ఈ వేడుకకు పలు సినీ ఇండస్ట్రీల నుంచి స్టార్స్ కి ఆహ్వానం అందగా, టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఇన్విటేషన్ అందుకున్నాడు. అయితే దీని వెనుకు..

NTR: పునీత్ రాజ్ కుమార్.. ఒక స్టార్ ఫామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చి, ఆ ఫ్యామిలీకే కాదు టోటల్ కన్నడకే పవర్ స్టార్ అనిపించుకున్నాడు. అయన నటనకి, డాన్సులకి అభిమానులు ఉండవచ్చు, కానీ అయన వ్యక్తిత్వానికి మాత్రం భక్తులు ఉంటారు. కన్నడనాట ఎన్నో సేవ కారిక్రమాలు చేయడమే ఆయన్ని ప్రజల్లో దేవుడిని చేసింది.

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ విగ్రహం తయారీ తెనాలిలో.. నవంబర్ 1న కర్ణాటకలో ఆవిష్కరణ..

కాగా పునీత్ మరణాన్ని తట్టుకోలేకపోతున్నా కన్నడిగులకు అక్కడి ప్రభుత్వం ఒక తియ్యని వార్త చెప్పింది. దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు నవంబర్ 1న రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారమైన ‘కర్ణాటక రత్న’ ప్రకటించింది. ఈ వేడుకకు పలు సినీ ఇండస్ట్రీల నుంచి స్టార్స్ కి ఆహ్వానం అందగా, టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఇన్విటేషన్ అందుకున్నాడు. అయితే దీని వెనుకు రాజకీయ కోణం ఉందంటున్నారు కొందరు విశ్లేషకులు.

తెలుగులో ఎందరో సీనియర్‌ స్టార్లు ఉన్నప్పుడు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం జూనియర్‌ ఎన్టీఆర్‌ని ఎందుకు ఎంపిక చేసిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో బీజేపీ నాయకులూ ఎన్టీఆర్ ని కలవడమే ఈ అనుమానాలకు దారి తీస్తున్నాయి. అయితే పునీత్ రాజ్‌కుమార్‌తో ఎన్టీఆర్ కున్న స్నేహం మరియు కన్నడలో అతని పాపులారిటీ వల్లే ఆహ్వానం అందింది అంటున్నారు ఫ్యాన్స్.

 

ట్రెండింగ్ వార్తలు