GST Raids: కన్నప్ప రిలీజ్ కు ముందు కలకలం.. మంచు విష్ణు ఆఫీస్ లో ఐటీ, జీఎస్టీ సోదాలు..

ఇందులో దాచాల్సింది ఏమీ లేదన్నారాయన. అంతేకాదు ఎక్కడెక్కడ అప్పులు చేశామో వాళ్లకే తెలుస్తుందన్నారు మంచు విష్ణు.

GST Raids: హైదరాబాద్ మాదాపూర్ లోని హీరో మంచు విష్ణు ఆఫీస్ లో ఐటీ, జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమాని నిర్మించారు మంచు విష్ణు. ఈ సినిమా బడ్జెట్ కు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. జీఎస్టీ, ట్యాక్స్ ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. అయితే, ఐటీ జీఎస్టీ సోదాల విషయం తనకు తెలియదన్నారు మంచు విష్ణు. సోదాలు జరిపితే మంచిదే అన్నారు. ఇందులో దాచాల్సింది ఏమీ లేదన్నారాయన. అంతేకాదు ఎక్కడెక్కడ అప్పులు చేశామో వాళ్లకే తెలుస్తుందన్నారు మంచు విష్ణు.

కన్నప్ప సినిమా ఈ నెల 27న రిలీజ్ కాబోతోంది. సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తోంది చిత్ర యూనిట్. బిజినెస్ కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో జీఎస్టీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. మంచు విష్ణు ఆఫీసుల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. జీఎస్టీ చెల్లించారా లేదా అనేది తెలుకుంటున్నారు. సినిమాకి సంబంధించి కొంత వర్క్ ఉండటంతో మంచు విష్ణు ప్రసాద్ ల్యాబ్ కి వెళ్లారు. జీఎస్టీ సోదాల గురించి తనకు సమాచారం లేదన్నారు మంచు విష్ణు. తన ఆఫీస్ కి వెళ్లి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తానన్నారు.

భారీ బడ్జెట్ తో నిర్మించే సినిమాలకు అదే స్థాయిలో బిజినెస్ అవుతుంది. దీనికి సంబంధించి ఐటీ ట్యాక్స్, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సినిమా రిలీజ్ కు అవకాశం ఉంటుంది. కాగా.. ఐటీ, జీఎస్టీ అధికారుల సోదాలు కామన్ అంటున్నారు. ఏదైనా సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో లేదా రిలీజ్ అయ్యాక ఐటీ, జీఎస్టీ సోదాలు ఒక ప్రాసెస్ లో భాగమే అంటున్నారు.

Also Read: మంచు విష్ణు ‘క‌న్న‌ప్ప‌’కు శుభ‌వార్త చెప్పిన ఏపీ ప్ర‌భుత్వం.. 10 రోజుల పాటు..

గతంలోనూ పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఇలానే అధికారులు సోదాలు నిర్వహించారు. కొన్ని రోజుల తరబడి అధికారులు సోదాలు చేయడం జరిగింది. ఇప్పుడు కన్నప్ప విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. సినిమా కోసం ఎంత ఖర్చు చేశారు, ఎంత బిజినెస్ అయ్యింది, క్లియరెన్స్ ఉందా లేదా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ లు, జీఎస్టీ చెల్లించారా లేదా? ఎంత చెల్లించాల్సి ఉంది? అనే మొత్తం విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.