Jaanavule Song released from Pawan Kalyan Sai Dharam Tej Bro Movie
Jaanavule Song Bro Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం బ్రో. తమిళంలో ఘన విజయం సాధించిన వినోదయ సితం (Vinodaya Sitham) సినిమాకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. తమిళ్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖనినే ఈ రీమేక్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను ఇప్పటికే మొదలుపెట్టింది. ఇప్పటికే టీజర్, ‘మై డియర్ మార్కండేయ’ అంటూ సాగే క్లబ్ సాంగ్ విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు.
Baby Movie Thank you Meet : ‘బేబీ’ సినిమా థ్యాంక్యూ మీట్..
జాణవులే.. అంటూ ఈ పాట సాగింది. సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ మధ్య ఇది ఓ రొమాంటిక్ సాంగ్ లా ఉండటంతో సినిమాలో మంచి లవ్ స్టోరీ కూడా ఉండొచ్చని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ ఉంది.