Satya Sri : సొంతింట్లోకి అడుగుపెట్టిన జబర్దస్త్ నటి.. సత్యశ్రీ గృహప్రవేశం.. ఫొటోలు వైరల్..

తాజాగా తణుకులో కట్టుకున్న తన సొంతింట్లోకి గృహ ప్రవేశం చేసింది సత్యశ్రీ.

Satya Sri : సొంతింట్లోకి అడుగుపెట్టిన జబర్దస్త్ నటి.. సత్యశ్రీ గృహప్రవేశం.. ఫొటోలు వైరల్..

Jabardasth Actress Satya Sri New House Warming Ceremony Photos goes Viral

Updated On : November 13, 2024 / 2:03 PM IST

Satya Sri : జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకుంది సత్యశ్రీ. జబర్దస్త్ స్కిట్స్ లో నటించి అనంతరం పలు ఈవెంట్స్, సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇప్పుడు ఓ పక్కన టీవీ షోలలో, సినిమాలతో బిజీగానే ఉంది సత్యశ్రీ. తాజాగా సత్యశ్రీ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. తన సొంత ఊరు అయిన తణుకులో సత్యశ్రీ కొత్త ఇల్లు కట్టుకుంది.

Also Read : Shahid Kapoor : ముంబైలో అపార్ట్‌మెంట్‌ తీసుకున్న షాహిద్ కపూర్.. నెల రెంట్ అన్ని లక్షలా..

తాజాగా తణుకులో కట్టుకున్న తన సొంతింట్లోకి గృహ ప్రవేశం చేసింది సత్యశ్రీ. తన ఇంటి గృహ ప్రవేశం ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. సత్యశ్రీ గృహప్రవేశం ఫొటోలు షేర్ చేసి.. ఇది ఇల్లు కాదు నా కల. కొత్త ఇల్లు, కొత్త ప్రారంభం, కొత్త జ్ఞాపకాలు. నా సొంతూరు తణుకులో సొంత ఇల్లు అంటూ పోస్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Satya Sri (@me_satyasri)

దీంతో పలువురు నెటిజన్లు, టీవీ ప్రముఖులు సత్యశ్రీ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సత్యశ్రీ గృహ ప్రవేశం ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.