Chiranjeevi : క్యాస్టింగ్ కౌచ్ లేదు.. ఎవరైనా కష్టపడాల్సిందే.. ఆ తప్పు నా మీదే వేసుకుంటాను.. చిరు కామెంట్స్..

ఈ ఈవెంటుకి మెగాస్టార్ చిరంజీవి హాజరయి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Chiranjeevi)

Chiranjeevi : క్యాస్టింగ్ కౌచ్ లేదు.. ఎవరైనా కష్టపడాల్సిందే.. ఆ తప్పు నా మీదే వేసుకుంటాను.. చిరు కామెంట్స్..

Chiranjeevi

Updated On : January 25, 2026 / 11:11 PM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. ఇప్పటికే ఈ సినిమా 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ గెస్ట్ రోల్ లో నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని, ఫ్యాన్స్ ని మెప్పించింది. ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవి కనపడటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.(Chiranjeevi)

నేడు ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంటుకి మెగాస్టార్ చిరంజీవి హాజరయి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also See : Mana Shankara VaraPrasad Garu : మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫోటోలు.. చిరంజీవి, వెంకటేష్ సందడి..

Chiranjeevi

చిరంజీవి మాట్లాడుతూ.. నిర్మాతలు సాహు, సుస్మిత అనిల్ రావిపూడి జనాల్లోకి వెళ్లి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను అలా వెళ్లలేకపోతున్నాను అని బాధపడ్డాను. ఠాగూర్ సినిమా అప్పుడు వినాయక్ కూడా సక్సెస్ ని ఎంత ఎంజాయ్ చేసాడో చెప్పాడు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ షీల్డ్స్ ఇచ్చి వింటేజ్ చిరంజీవి కాదు వింటేజ్ సెలబ్రేషన్స్ ని కూడా అనిల్ రావిపూడి తెచ్చాడు. రాఘవేంద్రరావు గారే ఈ సినిమాకు పునాది వేశారు. అనిల్ రావిపూడి ని చూస్తుంటే రాఘవేంద్రరావు గారే గుర్తొచ్చారు.

అనిల్ రావిపూడి అందరితో సరదాగా ఉంటారు. ఈ మధ్య కాలంలో సెట్ లో సరదాగా ఉన్న సినిమాలు కొన్నే. ఖైదీ నెంబర్ 150 తర్వాత వాల్తేర్ వీరయ్య, ఇపుడు మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్స్ లో హుషారుగా సరదాగా ఉన్నాను. మిగతా సినిమాలకు కొంత వర్రీగా ఉన్నాను, ఏదోలా ఉంటుంది. కానీ ఆ తప్పు నా మీదే వేసుకుంటాను, వేరే వాళ్ళ మీద వేయను. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఈ సంక్రాంతి నా జీవితంలో మర్చిపోలేను. మన తెలుగు ఇండస్ట్రీ ఫ్యూచర్ అనిల్ రావిపూడి.

నా కూతురు సుస్మిత ఇండస్ట్రీకి రావాలనుకొని ఫస్ట్ చరణ్ కి చెప్పింది. చరణ్ రా అన్నాడు. కానీ ఇందులోకి రావాలి అని డౌట్ పడుతుంటే కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ లోకి రమ్మని రంగస్థలంలో పనిచేయమన్నాడు. రంగస్థలంలో కొన్ని కాస్ట్యూమ్స్ కోసం రాజమండ్రి వీధుల్లో తిరిగింది అని, తనెంత కష్టపడిందో అని మూవీ టీమ్ చెప్తే గర్వపడ్డాను. ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే కష్టం ఒకటే ఊతం. అది చిరంజీవేయి కూతురు అయినా కొడుకు అయినా. తర్వాత నిర్మాత అవుతానంది వెల్కమ్ అని చెప్పను. ఇండస్ట్రీ అద్దం లాంటిది. మనం ఎలా ఉంటే అలా ఉంటుంది. నువ్వు కష్టపడితే రిజల్ట్ వస్తుంది. లేకపోతే లేదు. తను అడిగితే ఇంట్లో ఏ హీరో అయినా చేస్తాడు కానీ గ్రౌండ్ నుంచి చేయాలని బయటకు వెళ్లి వెబ్ సిరీస్ లు చేయడం మొదలుపెట్టింది. అన్ని డిపార్ట్మెంట్స్ లో వర్క్ తెలుసుకొని పని చేసింది లాభం లేకపోయినా.

Chiranjeevi

వేరే ఒక బ్యానర్ నాతో సినిమా చేస్తాం అంటే సుస్మిత కొలాబరేషన్ అని చెప్తే వాళ్ళు సుస్మిత ఏం పెట్టక్కర్లేదు పేరు వేస్తాం అంటే తను నిజంగా కష్టపడాలి, నిర్మాతగా సినిమా చేయాలి అని అవసర్లేదు అని వదులుకుంది సినిమా. ఇప్పుడు సాహుతో కలిసి సగం డబ్బులు పెటింది. నాకు రెమ్యునరేషన్ ఇచ్చింది. తనని చూసి గర్వపడుతున్నాను. ఇండస్ట్రీకి అందరూ రావొచ్చు. క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ఇక్కడ ఉండవు. మీకుండే అభద్రతా భావం వల్లే అలాంటివి ఉంటాయి. నువ్వు ప్రొఫెషనల్ గా ఉంటే అందరూ ప్రొఫెషనల్ గానే ఉంటారు. మా అమ్మాయి, అశ్విని దత్ అమ్మాయిలు, సుప్రియ.. ఇలా చాలా మంది సక్సెస్ అయ్యారు. అమ్మాయిలు రావాలి సినీ పరిశ్రమలోకి. ఇది గొప్ప ఇండస్ట్రీ.

చాలామంది అవుట్ డోర్ బిల్స్ పెంచేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఈ సినిమా కెమెరామెన్ సమీర్ చాలా ఫాస్ట్ గా చేసాడు. ఒక్కోసారి గ్యాప్ లో టీ తాగే టైం కూడా ఇవ్వలేదు. అతను చాలా కంట్రోలింగ్ లో చేసాడు. సమీర్ నాకు చాలా బాగా నచ్చాడు. రిలీజ్ కి ముందే బడ్జెట్ కంట్రోల్ లో ఉండటంతో సక్సెస్ అయ్యారు నిర్మాతలు. ఇలా చేయాలని నేను ఎవరికీ సలహాలివ్వట్లేదు కానీ చెప్తున్నాను. ఈ సినిమాకు నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయి. అడిగితే చెప్పలేదు. హర్షకు మధ్యలో కాలు విరిగినా కష్టపడి పనిచేసాడు. విటివి గణేష్ ని ఎడిటింగ్ లో తీసేసారు. ఎడిటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మరోసారి ప్రూవ్ అయింది ఈ సినిమాతో.

సినిమా చూసి మా కోసం ఇంత కష్టపడుతున్నావా అని ఒక మహిళా అభిమాని అన్న మాటలు నాకు ఆనందాన్నిచ్చాయి. నన్ను రెస్ట్ తీస్కో అని ఆమె ఎమోషనల్ అయింది. ఆమె మాటలు విని నేను ఎమోషనల్ అయ్యాను. మీ కోసమే నేను ఆనంద పడుతూ వర్క్ చేస్తున్నా. ఈ సినిమాకు ప్రకాష్ వేసిన సెట్ అందరికి నచ్చింది. అందరూ వచ్చి ఫోటోలు తీసుకొని ఇలాంటి ఇళ్లు కట్టుకోవాలని అనుకున్నారు. అనిల్ రావిపూడి తండ్రిని చూస్తే నాకు కుళ్ళు వస్తుంది. నా కంటే ఎక్కువ పుత్రోత్సాహం పొందుతున్నాడు అని చెప్తూ సినిమాకు పనిచేసినవాళ్లను అభినందించి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

Also See : Pawan kalyan : భార్యతో పవన్ కళ్యాణ్.. సింగ్ లుక్ లో ఫోటోలు వైరల్..