Shahid Kapoor : ముంబైలో అపార్ట్‌మెంట్‌ తీసుకున్న షాహిద్ కపూర్.. నెల రెంట్ అన్ని లక్షలా..

Shahid Kapoor : ముంబైలో అపార్ట్‌మెంట్‌ తీసుకున్న షాహిద్ కపూర్.. నెల రెంట్ అన్ని లక్షలా..

Shahid Kapoor took an apartment in Mumbai

Updated On : November 13, 2024 / 2:52 PM IST

Shahid Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి భారీ గుర్తింపు సంపాదించుకున్నాడు. బాలీవుడ్ లో లవర్ బాయ్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇక 2015లో ఆయన మీరా ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకి ఓక పాప, బాబు ఉన్నారు.

అయితే తాజాగా షాహిద్ కపూర్ ముంబైలోని ప్రతిష్టాత్మకమైన త్రీ సిక్స్టీ వెస్ట్, వర్లీలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నాడు. కాగా ఆ విలాసవంతమైన ఇంటి నెల అద్దె 20 లక్షలు. అంతే కాదు ఈ అద్దె క్రమంగా 23 లక్షలకి చేరుతుందట. దీనికి సంబందించిన అగ్రిమెంట్ ను ఐదు ఏళ్ల పాటు చేసుకున్నారట. ఈ అగ్రిమెంట్ ను నవంబర్, 2024లో చేసుకున్నట్టు తెలుస్తుంది.

Also Read : Ram Gopal Varma : రామ్‌గోపాల్‌కు వ‌ర్మకు నోటీసులు.. చంద్రబాబు, పవన్‌లపై అనుచిత పోస్టులు పెట్టారంటూ..

నిజానికి చాలా మంది సినీ సెలబ్రిటీస్ ముంబైలోనే ఉంటారు. అక్కడే కోట్ల డబ్బు ఖర్చు చేసి విలాసవంతమైన విల్లాలను కొనుగోలు చేస్తుంటారు. అక్కడే తమ భార్య పిల్లలతో ఉంటారు. ఇక ఇప్పుడు షాహిద్ కపూర్ సైతం ముంబైలో నెలకి లక్షల రెంట్ కడుతూ ఉండడం షాకింగ్ గా ఉంది.