Jabardasth Artist Kevvu Karthik shares Photos in Pushpa Gangamma Jathara Getup
Kevvu Karthik : అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో వచ్చిందో అంతకు పది రేట్లు పుష్ప 2 క్రేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో కూడా ఫుల్ క్రేజ్ వచ్చింది. కలెక్షన్స్ పరంగా ఇప్పటికే 1831 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి 2 రికార్డు కూడా బ్రేక్ చేసింది పుష్ప 2(Pushpa 2) సినిమా. ఫ్యాన్స్ అయితే పుష్ప 2 భారీ విజయంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నెల రోజులైనా ఇంకా నార్త్ లో అయితే హడావిడి తగ్గలేదు.
పుష్ప 2 సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ బాగా హైలెట్ అయింది. అల్లు అర్జున్ చీర కట్టుకొని, నగలు పెట్టుకొని, మేకప్ వేసుకొని గంగమ్మ తల్లి జాతరలో డ్యాన్స్ చేయడమే కాకుండా అదే గెటప్ తో ఫైట్ కూడా చేస్తాడు. దీంతో ఈ టోటల్ సీక్వెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో థియేటర్స్ కి కూడా పలువురు ఫ్యాన్స్ అల్లు అర్జున్ లాగే చీర కట్టుకొని పుష్ప గంగమ్మ జాతర గెటప్ లో వచ్చి సందడి చేసారు.
చాలా మంది ఈ గెటప్ వేసి రీల్స్ కూడా చేసారు. తాజాగా జబర్దస్త్ నటుడు కెవ్వు కార్తిక్ అల్లు అర్జున్ లాగే చీరకట్టి, మేకప్ వేసి పుష్ప గంగమ్మ జాతర గెటప్ లో తయారయ్యాడు. తాజాగా ఆ గెటప్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో ఈ గెటప్ తో జబర్దస్త్ లో కెవ్వు కార్తీక్ స్కిట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన షూటింగ్ జరగ్గా త్వరలోనే ఆ ఎపిసోడ్ రానుంది.
కెవ్వు కార్తీక్ పుష్ప గంగమ్మ జాతర గెటప్ ఫొటోలు వైరల్ అవ్వగా ఫ్యాన్స్ కార్తీక్ ఎలా చేసాడో, స్కిట్ ఎలా ఉంటుందో అని ఎదురుచూస్తున్నారు. ఇక కార్తిక్ మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి టీం లీడర్ గా ఎదిగాడు. ఓ పక్క సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే మరో పక్క జబర్దస్త్, పలు టీవీ షోలతో బిజీగా ఉన్నాడు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తన వర్క్ అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ ఫొటోలు కూడా షేర్ చేస్తూ ఉంటాడు.
Also See : Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫొటోలు చూశారా? బాస్ నవ్వితే ఆ కిక్కే వేరప్పా..