jabardasth comedian Dhanraj directing his first movie
Dhanraj : తెలుగు బ్లాక్ బస్టర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా చాలామంది టేలెంటెడ్ టెక్నీషియన్స్ టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఆ షో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు కమెడియన్‌గా, హీరోగా, రచయితగా, దర్శకులుగా వెండితెర పై సత్తా చాటుతున్నారు. ఇటీవల జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ ని సంపాదించుకొని వేణు.. దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా ‘బలగం’. ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడియన్ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. జబర్దస్త్ షోలో తన ధనాధన్ కామెడీతో ఆడియన్స్ ని అలరించిన ధనరాజ్.. అనేక సినిమాల్లో కమెడియన్ గా కూడా రాణించాడు. కొన్ని సినిమాల్లో మెయిన్ లీడ్ చేస్తూ కూడా నటించాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్నాడు. ‘దర్శకుడిగా నా మొదటి ప్రయాణం’ మొదలు పెడుతున్నాను అంటూ ప్రేక్షకుల ప్రేమ, ఆశీస్సులు కోరుతూ ధనరాజ్ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ తో పాటు ఈ మూవీ పూజా కార్యక్రమాల ఫోటోలు కూడా షేర్ చేశాడు.
Also read : Skanda OTT : అనుకున్న సమయానికి కంటే ముందుగానే ఓటీటీలోకి రామ్,బోయపాటి సినిమా..! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఆ ఫొటోలో రెండు క్లాప్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఒకదాని పై తెలుగులో ప్రొడక్షన్ నెంబర్ వన్ అని ఉంటే, మరో దానిపై తమిళంలో రాసి ఉంది. ఇది చూస్తుంటే ధనరాజ్ మొదటి సినిమానే బై లింగువల్ గా తెలుగు, తమిళంలో తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది. ‘స్లేట్ పెన్సిల్ స్టోరీస్’ బ్యానర్ తమ మొదటి సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మూవీ సంబంధించిన పూర్తి వివరాలను ధనరాజ్ ఇంకా తెలియజేయాల్సి ఉంది. మరి ధనరాజ్ కూడా వేణు మాదిరి దర్శకుడిగా ఆడియన్స్ ని మెప్పిస్తాడా..? లేదా..? చూడాలి.
దర్శకుడిగా నా మొదటి ప్రయాణం .. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు, ఉంటాయని కోరుతూ….
Dhanrajkoranani✍️ pic.twitter.com/51Lekz3hCo
— Dhanraj koranani (@DhanrajOffl) October 22, 2023