Jabardasth Emmanuel introduced his girlfriend.
Emmanuel: బిగ్ బాస్ సీజన్ 9లో చాలా మందికి ఫేవరేట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది ఇమ్మాన్యుయేల్(Emmanuel) అనే చెప్పాలి. తన మార్క్ కామెడీ తో ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు ఈ కంటెస్టెంట్. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు టాస్క్ ల్లో కూడా తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు ఇమ్ము. దాంతో ఈ సీజన్ విన్నర్ అతనే అన్ని చాలా మంది ఫిక్స్ అయ్యాడు. కానీ, బ్యాడ్ లాక్ మనోడు కేవలం టాప్ 5తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన లవ్ గురించి, తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి చెప్పుకొచ్చాడు.
Mowgli 2025 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ మూవీ మోగ్లీ.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
కొంతకాలంగా తాను లవ్ లో ఉన్నానని, బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళాక తననే పెళ్లాడుతానని చెప్పాడు ఇమ్మాన్యుయేల్. ఇక అప్పటినుంచి ఇమ్ము ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడని, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనేది తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా తన లవర్ హ్యాండ్ పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో స్టోరీ కింద పెట్టాడు ఇమ్మాన్యుయేల్. ఆ పిక్ కాస్త వైరల్ గా మారింది. దీంతో, ఇమ్ము పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
అయితే, ఈ ఫోటోలు కేవలం ఆ అమ్మయి చేయిని మాత్రమే చూపించాడు ఇమ్మాన్యుయేల్. పేరు గాని, ఫేస్ గానీ రివీల్ చేయలేదు. అయితే, ఒక్కటి మాత్రం క్లారిటీ ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అని. దాంతో, ఈ కపుల్ కి సోషల్ మీడియాలో నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఇమ్మాన్యుయేల్ తనకు కాబోయే భార్యను ఎప్పుడు అందరికి పరిచయం చేస్తున్నాడు అనేది చూడాలి.