Mowgli 2025 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ మూవీ మోగ్లీ.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
రోషన్ కనకాల హీరోగా వచ్చిన టాలీవుడ్ లేటెస్ట్ హిట్ మూవీ మోగ్లీ 2025 ఓటీటీ(Mowgli 2025 OTT) స్ట్రీమింగ్ సిద్ధం అయ్యింది.
Roshan Kanakala Mowgli 2025 movie OTT streaming update.
Mowgli 2025 OTT: యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మోగ్లీ 2025. దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో సాక్షి మడోల్కర్ హీరోయిన్ గా నటించింది. బండి సరోజ్ స్పెషల్ రోల్ చేశాడు. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తరువాత మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో, మోగ్లీ 2025 సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
Ashika Ranganath: కసి చూపులతో కేక పెట్టిస్తున్న ఆషిక.. గ్లామర్ పీక్స్.. ఫోటోలు
ఈ నేపధ్యంలోనే తాజాగా మోగ్లీ 2025 ఓటీటీ స్ట్రీమింగ్(Mowgli 2025 OTT) గురించి ఆలోచూస్తున్నారట మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు మోగ్లీ 2025 సినిమాను న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న స్ట్రీమింగ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. ఈమేరకు ఈటీవీ విన్ అధికారిక ప్రకటన కూడా చేసింది. దీంతో, ఓటీటీ ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే, థియేటర్స్ లో ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అంతగా రెస్పాన్స్ రాలేదు. కాబట్టి, ఓటీటీలో మోగ్లీ 2025 సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి, ఓటీటీలో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఎక్కువగా ఉంది.
