Devara : ‘దేవర’లో నటిస్తున్న జబర్దస్త్ కమెడియన్.. దేవర గురించి ఏం చెప్పాడంటే..

తాజాగా జబర్దస్త్ నటుడు గెటప్ శ్రీను దేవర గురించి మాట్లాడాడు.

Getup Srinu : ఎన్టీఆర్(NTR) దేవర(Devara) సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దేవర పార్ట్ 1 అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ చేస్తారని కూడా ప్రకటించారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే దేవర సినిమా గురించి హైప్ పెంచుతూ అందులో నటించిన పలువురు నటీనటులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Pawan Kalyan OG : పవన్ OG అసలు పేరు ఇదా.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదంట.. క్లారిటీ ఇచ్చిన సుజీత్..

తాజాగా జబర్దస్త్ నటుడు గెటప్ శ్రీను దేవర గురించి మాట్లాడాడు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న గెటప్ శ్రీను ఇటీవల రాజు యాదవ్ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో గెటప్ శ్రీను దేవర గురించి మాట్లాడుతూ.. నేను కూడా దేవర సినిమాలో ఓ పాత్ర చేశాను. సినిమా అయితే చాలా బాగుంటుంది. ఎన్టీఆర్ గారి నటన అదిరిపోతుంది. ఎన్టీఆర్ లుక్ సినిమా మొత్తం సూపర్ గా ఉంటుంది. తన పాత్రకు తగ్గట్టు ఎన్టీఆర్ కూడా డిఫరెంట్ మేకోవర్ ట్రై చేసాడు అని తెలిపాడు. దీంతో మరోసారి ఎన్టీఆర్ నటన, దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్రెండింగ్ వార్తలు