Jabardasth Mahidhar : తన యూట్యూబ్ సబ్‌స్క్రైబర్ తో ప్రేమ, త్వరలో పెళ్లి.. ఈ జబర్దస్త్ నటుడి లవ్ స్టోరీ భలే ఉందే..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ మహీధర్ తన ప్రేమ కథ గురించి చెప్పాడు. (Jabardasth Mahidhar)

Jabardasth Mahidhar

Jabardasth Mahidhar : జబర్దస్త్ కామెడీ షోతో ఎంతోమంది కమెడియన్స్, నటీనటులు పరిశ్రమకు పరిచయమైన సంగతి తెలిసిందే. అందులో మహీధర్ ఒకరు. జబర్దస్ లో ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత రైటర్ గా, టీమ్ లీడర్ గా ఎదిగాడు మహీధర్. కానీ అక్కడ జరిగిన పలు సంఘటనలతో జబర్దస్త్ మానేసాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రివ్యూలు, ఇంటర్వ్యూలు చేస్తూ మరో పక్క ఓ కేఫ్ బిజినెస్ పెట్టాడు మహీధర్.(Jabardasth Mahidhar)

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహీధర్ తన ప్రేమ కథ గురించి చెప్పాడు.

Also See : Divyabharathi : చీరలో మెరిపిస్తున్న తమిళ భామ దివ్యభారతి..

మహీధర్ మాట్లాడుతూ.. నాకు లవర్ ఉంది. త్వరలోనే పెళ్లి చేసుకుంటాం. రాజమండ్రి అమ్మాయి. వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీ లో MSC అయిపోయింది. యూనివర్సిటీలో చదివేటప్పుడు నాకు పరిచయం అయింది. తను నా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్. తనే మొదట నాకు ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది. నా ఫ్యాక్ట్ వీడియోస్ చూసేది. నా వీడియోస్ బాగున్నాయి అంటూ మెసేజ్ చేసింది. తర్వాత పండగలకు, పుట్టిన రోజులకు మెసేజ్ లు చేసి బాగా పరిచయం అయింది. నేను వైజాగ్ లోనే ఉంటున్నాను తను కూడా వైజాగ్ లోనే చదువుతుందని తెలిసి బయట కలిసాము. తర్వాత మా పరిచయం ప్రేమగా మారింది. 2019 నుంచి ప్రేమ ఉంది. మా ఇద్దరి ఇళ్లల్లో ఒప్పుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటాము అని తెలిపాడు.

ఇలా యూట్యూబ్ వీడియోలు చూసి సబ్ స్క్రైబర్ మెసేజ్ చేసి ప్రేమించుకొని పెళ్లి చేసుకోబోతుండటం.. ఈ లవ్ స్టోరీ కొత్తగా ఉందే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Also See : Shivathmika Rajashekar : చీరలో సింపుల్ లుక్స్ తో అలరిస్తున్న శివాత్మిక..