Jabardasth Naresh
Jabardasth Naresh : జబర్దస్త్ షోతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు నరేష్. చూడటానికి పొట్టిగా ఉన్నా ఆ హైట్ నే తనకు అనుగుణంగా మార్చుకొని టీవీ, సినీ పరిశ్రమలలో సక్సెస్ అవుతున్నాడు. ఇప్పుడు జబర్దస్త్, శ్రేదేవి డ్రామా కంపెనీ షోలతో పాటు టీవీ ఈవెంట్స్, బయట ఈవెంట్స్, అడదపాదడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.(Jabardasth Naresh)
తాజాగా నరేష్ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో తన పెళ్లి గురించి కూడా మాట్లాడాడు. గతంలో ఒక షోలో నరేష్ కి ఒక అమ్మాయితో పెళ్లి చూపులు అయినట్టు చూపించారు. అప్పట్లో ఆ ఎపిసోడ్ బాగా వైరల్ అయింది. దాంతో ఆ అమ్మాయి నరేష్ ని పెళ్లి చేసుకుంటుంది అని వార్తలు వచ్చాయి.
Also Read : Heroine : తల్లిని అవమానించిన రిలేటివ్స్.. కసితో ఏకంగా బెంజ్ కార్ కొన్న హీరోయిన్..
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దానిపై నరేష్ మాట్లాడుతూ.. అది ఆ ఎపిసోడ్ వరకు మాత్రమే. అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. ఆ అమ్మాయి కి నాకు సంబంధం లేదు. ఆ రోజే పరిచయం అయింది. మొదటిసారి వచ్చింది. షోకి వస్తే అలా స్కిట్ గురించి చెప్తే ఓకే అని ధైర్యంగా చేసింది. అందుకే ప్రోమోలు చూసి నమ్మకూడదు. ఎపిసోడ్ చూడాలి. ఎపిసోడ్ చివర్లో క్లారిటీ ఇచ్చాం అది కేవలం ఎపిసోడ్ వరకే అని.
నాకు పెళ్లి చేసుకొని పిల్లలు కనాలి, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి అని కోరిక. నేను చేసుకోబోయే అమ్మాయి నాకంటే ఒక అడుగున్నర ఎక్కువ హైట్ ఉంటే చాలు. మా అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి. నన్ను అర్ధం చేసుకోవాలి. మా పేరెంట్స్ కి ఇప్పుడు రెస్ట్ ఇచ్చాను. నేనే కష్టపడుతున్నా. ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళను చూసుకోవాలి, అర్ధం చేసుకోవాలి. కట్నం కూడా వద్దు అని తెలిపాడు. మరి నరేష్ ఫ్యూచర్ లో ఎవర్ని పెళ్లి చేసుకుంటాడో చూడాలి.
Also Read : Priyanka Chopra : రాజమౌళి కొడుకుతో ప్రియాంక చోప్రా డ్యాన్స్.. వీడియో వైరల్..