Jabardasth Pavithra got Emotional While Speaking about her Father
Jabardasth Pavithra : టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయి జబర్దస్త్ లో కమెడియన్ గా ఎంటర్ అయి మంచి గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. ప్రస్తుతం పలు టీవీ షోలు, సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగానే ఉంది. యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది పవిత్ర. తాజాగా ఓ టీవీ షోలో తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
సుధీర్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ అనే టీవీ షోలో పవిత్ర కూడా రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది. ఇటీవల ఓ ఎపిసోడ్ లో సుధీర్ మీరు లైఫ్ లో ఎవరికైనా సారీ చెప్పాలా అని అడగ్గా పవిత్ర దీనికి సమాధానమిస్తూ.. నేను సారీ చెప్పాలి అనుకుంటే మా నాన్నకు చెప్తాను. ఆయనతో నేను 13 ఏళ్ళు మాట్లాడలేదు. ఆయన చనిపోయాక వెళ్లి కాళ్ళు పట్టుకున్నాను. పేరెంట్స్ ఎలా ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళని జడ్జ్ చేసి, వాళ్ళని పనిష్ చేసే రైట్ అయితే పిల్లలుగా మనకు లేదు. నేను నా లైఫ్ లో మా నాన్న విషయంలో పెద్ద మిస్టేక్ చేశాను అంటూ ఎమోషనల్ అయింది.
ఈ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పవిత్ర తన తండ్రి గురించి మాట్లాడుతూ.. మా నాన్న లారీ డ్రైవర్. కష్టపడితే కానీ మాకు డబ్బులు రావు. కానీ మా నాన్న తాగుడుకు బానిస అయి మమ్మల్ని పట్టించుకోలేదు. భార్య పిల్లలను గాలికి వదిలేసాడు. మాకు తిండి లేకపోయినా మా నాన్న ఆయన తాగుడుకు చూసుకునేవాడు అందుకే ఆయనతో మాట్లాడటం మానేసాను అని చెప్పింది.