Manchu Lakhsmi : మంచు మనోజ్ కూతురు మొదటి బర్త్ డే.. క్యూట్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మంచు లక్ష్మి.. త్వరలో ముంబై తీసుకెళ్తాను అంటూ..

మంచు లక్ష్మి తన కోడలు దేవసేనతో కలిసి దిగిన పలు ఫొటోలతో ఓ వీడియో షేర్ చేసి..

Manchu Lakhsmi : మంచు మనోజ్ కూతురు మొదటి బర్త్ డే.. క్యూట్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మంచు లక్ష్మి.. త్వరలో ముంబై తీసుకెళ్తాను అంటూ..

Manchu Lakshmi Shares Cute post with Manchu Manoj Daughter Devasena

Updated On : April 2, 2025 / 4:16 PM IST

Manchu Lakhsmi : మంచు మనోజ్ – మౌనిక దంపతులకు గత సంవత్సరం కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ పాపకి దేవసేన అని పేరు పెట్టినట్టు అధికారికంగా మంచు ఫ్యామిలీ ప్రకటించింది. అప్పుడే ఆ పాప పుట్టి సంవత్సరం అయింది. తాజాగా నేడు మనోజ్ కూతురు దేవసేన మొదటి పుట్టినరోజు కావడంతో మేనత్త మంచు లక్ష్మి తన సోషల్ మీడియాలో క్యూట్ పోస్ట్ షేర్ చేసింది.

మంచు లక్ష్మి తన కోడలు దేవసేనతో కలిసి దిగిన పలు ఫొటోలతో ఓ వీడియో షేర్ చేసి.. నువ్వు పుట్టే ముందు రోజే దేవుడు నన్ను ఇక్కడికి రప్పించడానికి కారణం ఉందేమో. నేను ఆల్రెడీ వెళ్లిపోవడానికి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను, వర్క్ కూడా ఉంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు పుట్టావు దేవసేన. నిన్ను మొదట ఎత్తుకున్నది మీ అమ్మ, మీ నాన్న కాదు నేనే. నువ్వు పుట్టిన రోజంతా నేను నీతోనే గడిపాను. నువ్వు నాకు బాగా కనెక్ట్ అయ్యావు. మన ఇద్దరి మధ్య ఒక మంచి అనుబంధం ఉంది. నేను అది మాటల్లో చెప్పలేను. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్యూ. నీకు ఆల్రెడీ ధైరవ్ అన్నయ్య ఉన్నాడు. నాకు మనోజ్ సపోర్ట్ ఉన్నట్టే నీకు ధైరవ్ సపోర్ట్ ఉంటుంది. నేను నీతో ఉండి అల్లరి చేసే అత్తని. నీ మొదటి పుట్టిన రోజు నాడు చాలా చెప్పాలని ఉంది. కానీ నువ్వు హ్యాపీగా ఎదగాలి. ప్రపంచం నీకు అందంగా ఉండాలి. నువ్వు మా ఇంటి రాణివి. నీతో కలిసి జ్ఞాపకాలు పోగు చేసుకోడానికి నేను వెయిట్ చేస్తున్నాను. నిన్ను త్వరలో ముంబై తీసుకెళ్తాను. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఈ డైమండ్ ని నాకు ఇచ్చినందుకు మౌనిక, మనోజ్ లకు థ్యాంక్యూ అంటూ పోస్ట్ చేసుకొచ్చింది.

Also Read : Sharwanand : శర్వానంద్ కూతుర్ని చూశారా..? కూతురు, ఫ్యామిలీతో ఆలయాల సందర్శన.. వీడియో వైరల్

దీంతో మనోజ్ ఫ్యాన్స్, నెటిజన్లు మనోజ్ కూతురుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీ వివాదాల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ అని కాలేజీ, ఆస్తికి సంబంధించిన వివాదాలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. మనోజ్, మోహన్ బాబు ఈ వివాదాలతో కలక్టరేట్, పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్లొచ్చారు. అసలు ఈ గొడవలపై స్పందించని మంచు లక్ష్మి తాజాగా ఇలా మనోజ్ కూతురు మొదటి పుట్టిన రోజుకి ప్రేమతో పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.