Sharwanand : శర్వానంద్ కూతుర్ని చూశారా..? కూతురు, ఫ్యామిలీతో ఆలయాల సందర్శన.. వీడియో వైరల్

శర్వానంద్ - ర‌క్షితారెడ్డి దంపతులకు గత సంవత్సరం మార్చ్ లో ఆడ‌పిల్ల‌ పుట్టింది.

Sharwanand : శర్వానంద్ కూతుర్ని చూశారా..? కూతురు, ఫ్యామిలీతో ఆలయాల సందర్శన.. వీడియో వైరల్

Sharwanand Visits Temple with Her Daughter and Family Video goes Viral

Updated On : April 2, 2025 / 3:48 PM IST

Sharwanand : టాలీవుడ్ హీరో శ‌ర్వానంద్‌ గత సంవత్సరం మనమే సినిమాతో వచ్చి పలకరించాడు. త్వరలో నారి నారి నడుమ మురారి అనే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా నేడు శర్వానంద్ తన కూతురు పుట్టు వెంట్రుకలు తీయించారు. దానికి సంబంధించి ఆలయాలకు వెళ్లిన శర్వానంద్ వీడియోలు వైరల్ గా మారాయి.

శర్వానంద్ – ర‌క్షితారెడ్డి దంపతులకు గత సంవత్సరం మార్చ్ లో ఆడ‌పిల్ల‌ పుట్టింది. ఆ పాపకు లీలా దేవి మైనేని అని పేరు పెట్టినట్టు శర్వా అధికారికంగా తెలిపాడు. నిన్న సాయంత్రం శర్వానంద్ తన ఫ్యామిలీతో కలిసి విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని సందర్శించాడు. అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం నేడు ఉదయం విజయవాడ దగ్గర్లో ఉన్న మోపిదేవి సుబ్రహ్మనేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు శర్వా కుటుంబం.

Also See : Nagababu : ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఫోటోలు వైరల్..

మోపిదేవిలో శర్వానంద్ తన కూతురు లీలాదేవితో ప్రత్యేక పూజలు చేయించి పుట్టు వెంట్రుకలు తీయించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. శర్వా కూతురు క్యూట్ గా ఉందంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో చూసేయండి..