‘బ్యాడ్‌గర్ల్’ పోల్ డ్యాన్స్ చూశారా!..

  • Publish Date - September 19, 2020 / 05:44 PM IST

Jacqueline Poll Dance: సిల్వర్ స్క్రీన్‌పై మెరవాలంటే స్టార్స్ గ్లామర్‌తో పాటు ఫిట్‌నెస్ కూడా తప్పకుండా కాపాడుకోవాలి. అందుకే మన తారలంతా టైం దొరికితే చాలు జిమ్‌లో గంటల తరబడి వర్కౌట్స్, యోగా వంటివి చేస్తుంటారు.
ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా మరింత యవ్వనంగా కనిపించడానికి డైట్ పాటిస్తూ ఎంతో శ్రమిస్తుంటారు.


అందులో భాగంగా లంక బ్యూటీ, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ యోగ, జిమ్‌తో పాటు పోల్‌ డాన్స్‌ కూడా చేస్తోంది. ఇవే తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ అంటుంది. జాక్వలైన్‌ పోల్‌ డాన్స్‌ చేసిన లేటెస్ట్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్‌ ‘సాహో’ సినిమాలో ‘బ్యాడ్‌గర్ల్‌’ పాటలో కనిపించింది కుర్రకారుని కవ్వించింది జాక్వెలిన్.