ఓటీటీలో ధనుష్ సినిమా..

Jagame Thandiram: కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రం ‘జగమే తంత్రం’. త‌మిళంలో ‘జ‌గమే తంతిర‌మ్’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య ల‌క్ష్మి హీరోయిన్‌గా న‌టిస్తుంది. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. వైనాట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై శ‌శికాంత్ నిర్మిస్తున్నారు. ధ‌నుష్ న‌టిస్తోన్న 40వ చిత్ర‌మిది.

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. తాజాగా ‘జగమే తంత్రం’ తమిళ్ టీజర్ రిలీజ్ చేశారు. ధనుష్ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో, తన స్టైల్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నారు. హోటల్లో పనిచేసే సురులి అనే వ్యక్తి ఇంటర్నేషనల్ లెవల్ క్రిమినల్‌గా ఎలా మారాడు అనేది ఆసక్తికరంగా చూపించబోతున్నారని టీజర్ చూస్తే తెలుస్తుంది.

విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలవుతోంది.. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ‘జగమే తంత్రం’ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. ఇంతకుముందు తెలుగు పోస్టర్స్, సాంగ్ రిలీజ్ చేశారు. ఈ మూవీ తెలుగులో కూడా విడుదల అవుతుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.