Site icon 10TV Telugu

Jagapathi Babu : రజినీకాంత్ పై వైసీపీ విమర్శలు.. జగపతి బాబు ఏమన్నాడో తెలుసా?

Jagapathi Babu comments on ysrcp criticising Rajinikanth

Jagapathi Babu comments on ysrcp criticising Rajinikanth

Jagapathi Babu :  ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఎన్టీఆర్(NTR) శతజయంతి వేడుకలకు విజయవాడకు(Vijayawada) హాజరయ్యారు. రజినీకాంత్ కు ఎప్పట్నుంచో బాలకృష్ణ(Balakrishna), ఎన్టీఆర్, చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుక కార్యక్రమంలో రజినీకాంత్ పాల్గొని సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్యని పొగిడారు.

అయితే చంద్రబాబుని పొగడటంతో YCP నాయకులు రజినీకాంత్ పై ఫైర్ అయ్యారు. అసలు రజినీకాంత్ YCP గురించి కానీ, జగన్ గురించి కానీ, YCP నాయకుల గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఎన్టీఆర్ వేడుకలకు వచ్చాడు కాబట్టి ఎన్టీఆర్ తో పాటు అక్కడ స్టేజి మీద ఉన్న నాయకులని పొగిడాడు. చంద్రబాబుని పొగిడినందుకు కొడాలి నాని, రోజా, పేర్ని నాని, మధుసూదన్ రెడ్డి.. ఇలా పలువురు YCP నాయకులు రజినీకాంత్ ని దారుణంగా విమర్శించారు. అనకూడని మాటలన్నీ అన్నారు. దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ వైసీపీ నాయకులపై ఫైర్ అవుతున్నారు. ఒక సూపర్ స్టార్ ని ఏపీలోని నాయకులు విమర్శిస్తున్నారు అని తెలియడంతో దేశవ్యాప్తంగా ఉన్న రజిని అభిమానులు ycp నాయకులపై ఫైర్ అవుతున్నారు. వైసీపీ రజినీకాంత్ కి సారి చెప్పాలని #YSRCPApologizeRajini అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ కూడా చేశారు.

తాజాగా ఈ వివాదంపై నటుడు జగపతి బాబు మాట్లాడారు. గతంలోనే జగపతి బాబు, రజినీకాంత్ కలిసి పలు సినిమాల్లో నటించారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ప్రస్తుతం జగపతి బాబు రామబాణం సినిమాలో నటించాడు. గోపీచంద్ హీరోగా చేసిన ఈ సినిమా మే 5న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జగపతి బాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజినీకాంత్ వివాదంపై స్పందించాడు.

జగపతి బాబు మాట్లాడుతూ.. నేను టీవీలు, పేపర్లు చూడను. అందుకే రజినీకాంత్ పూర్తిగా ఏం మాట్లాడాడు, ఆయన్ని ఎవరు విమర్శించారు అనేది నాకు కరెక్ట్ గా తెలీదు. కానీ ఇలా ఇష్యూ జరిగిందని కొంతమంది చెప్పారు. రజినీకాంత్ నవ్విస్తూ నిజాలే మాట్లాడతాడు. తనని అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు. అది ఆయన అసలు పట్టించుకోడు, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారు.

Exit mobile version