Jayammu Nischayammu Raa : జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా.. సెకండ్ సీజన్.. సాయి పల్లవితో మొదలు.. ప్రోమో చూశారా?

ఇప్పుడు జయమ్ము నిశ్చయమ్మురా షోకి సీజన్ 2 మొదలు కాబోతుంది. (Jayammu Nischayammu Raa)

  • Published on- October 13, 2026 / 05:38 PM IST

Jayammu Nischayammu Raa

Jayammu Nischayammu Raa : జగపతి బాబు హోస్ట్ గా జీ తెలుగులో పాపులర్ సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ అనే షో ఒక సంవత్సరం క్రితం సందడి చేసింది. మొదటి సీజన్ లోనే నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, శ్రీలీల, జగపతి బాబు, రామ్, సందీప్ రెడ్డి వంగ, ఆర్జీవీ, రష్మిక, ప్రభుదేవా.. లాంటి సెలబ్రిటీలు వచ్చి ఎవరికీ తెలియని అనేక విషయాలని పంచుకున్నారు. జీ తెలుగు ఓటీటీతో పాటు జీ టీవీలో కూడా ఈ షో స్ట్రీమ్ అయింది.

ఇప్పుడు జయమ్ము నిశ్చయమ్మురా షోకి సీజన్ 2 మొదలు కాబోతుంది. సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ కి సాయి పల్లవి గెస్ట్ గా వచ్చింది. తాజాగా ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేసారు. చాలా రేర్ గా ఇంటర్వ్యూలు ఇచ్చే సాయి పల్లవి ఈ షోకి రావడంతో బోల్డన్ని విషయాలు చెప్పబోతుందని తెలుస్తుంది. మున్ముందు ఈ సీజన్ లో ఇంకా ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో చూడాలి.

Also Read : Aishwarya Pisse : భర్తతో విడాకులు తీసుకున్న సీరియల్ నటి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ పోస్ట్..

ఈ మొదటి ఎపిసోడ్ జీ తెలుగు ఓటీటీలో అక్టోబర్ 16న స్ట్రీమింగ్ కానుంది. జీ తెలుగు ఛానల్ లో అక్టోబర్ 18 రాత్రి 7.30 గంటలకు టెలికాస్ట్ అవ్వనుంది. దీంతో ఈ షో కోసం జగపతి బాబు ఫ్యాన్స్ తో పాటు ఈ ఎపిసోడ్ కోసం సాయి పల్లవి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.