Jagapathi Babu : అలనాటి హీరోయిన్స్ తో అప్పటి లవర్ బాయ్.. ఫోటో వైరల్..

జగపతి బాబు ఇటీవలే హోస్ట్ గా మారి జీ తెలుగులో జయమ్ము నిశ్చయమ్మురా అనే షో కూడా చేస్తున్నారు.(Jagapathi Babu)

Jagapathi Babu

Jagapathi Babu : ఒకప్పటి లవర్ బాయ్ జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే హోస్ట్ గా మారి జీ తెలుగులో జయమ్ము నిశ్చయమ్మురా అనే షో కూడా చేస్తున్నారు. ఈ షోకి పలువురు సెలబ్రిటీలను తీసుకొచ్చి వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసి సందడి చేస్తున్నారు.(Jagapathi Babu)

తాజాగా ఈ షోకి ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ మీనా, మహేశ్వరి, సిమ్రాన్ వచ్చారు. ఇటీవలే ఈ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. షూట్ గ్యాప్ లో ఈ ముగ్గురు జగపతి బాబుతో దిగిన ఫోటోని మీనా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. జగపతి బాబు ఇలా మీనా, సిమ్రాన్, మహేశ్వరి.. ముగ్గురు హీరోయిన్స్ తో ఫోటో దిగడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

Also Read : Star Producer : అల్లు అర్జున్ సినిమాలో యాక్టింగ్ చేసినందుకు నిర్మాతను తిట్టిన భార్య.. ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా?

మరి ఈ ముగ్గురు పాత సినిమాల గురించి, అప్పటి సంగతులు గురించి ఏం చెప్తారో ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. మీనా జగపతి బాబుతో చిలకపచ్చ కాపురం, జగన్నాటకం, భలే పెళ్ళాం సినిమాల్లో నటించింది. మహేశ్వరి ప్రియరాగాలు, జాబిలమ్మ పెళ్లి సినిమాల్లో జగపతి బాబుతో కలిసి నటించింది.