Jagapathi Babu
Jagapathi Babu : ఇటీవల సినీ సెలబ్రిటీలు కూడా హోస్ట్ లుగా మారి పలు టీవీ షోలు, ఓటీటీ షోలు చేస్తున్న క్రమంలో జగపతి బాబు కూడా యాంకర్ గా మారారు. ఒకప్పుడు హీరోగా ఎన్నో సక్సెస్ సినిమాలు చూసిన జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు.
జగపతి బాబు హోస్ట్ గా జయమ్ము నిశ్చయమ్మురా అనే షో ని చేస్తున్నారు. ఈ షోకి పలువురు సెలబ్రిటీలను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయనున్నారు. తాజాగా మొదటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. మొదటి ఎపిసోడ్ కి కింగ్ నాగార్జున గెస్ట్ గా వచ్చారు. అలాగే నాగార్జున అన్నయ్య వెంకట్, సోదరి నాగ సుశీల కూడా వచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక సంగతులు మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. నాగార్జున , జగపతి బాబు ఫ్యాన్స్ ఈ షో కోసం ఎదురుచూస్తున్నారు. జయమ్ము నిశ్చయమ్మురా షో జీ తెలుగు ఛానల్ లో ప్రతి ఆదివారం టెలికాస్ట్ అవ్వనుంది. మొదటి ఎపిసోడ్ ఆగస్టు 17 రాత్రి 9 గంటలకు జీ తెలుగులో టెలికాస్ట్ అవ్వనుంది.
మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..