Jagapathi Babu
Jagapathi Babu : జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, ఫాదర్ క్యారెక్టర్స్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గతంలో జగపతి బాబు తండ్రి పెద్ద నిర్మాత. ఇపుడు జగపతి బాబు కూడా నిర్మాతగా మారబోతున్నాడు. ఆల్రెడీ డైరెక్టర్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చాడట.(Jagapathi Babu)
ఇటీవల లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా వచ్చి పెద్ద హిట్ అయింది. ఈ సినిమా జస్ట్ రెండున్నర కోట్లు పెట్టి తీస్తే ఏకంగా ఇప్పటికే 22 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాని కొత్త దర్శకుడు సాయి మార్తాండ్ తెరకెక్కించాడు. తాజాగా లిటిల్ హార్ట్స్ థ్యాంక్యూ మీట్ జరగ్గా సాయి మార్తాండ్ ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.
Also Read : Bunny Vasu : మా అందరికి బలుపు పెరిగిందా? మేము చూసుకోవట్లేదా.. బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు..
సాయి మార్తాండ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తండ్రి పాత్ర జగపతి బాబు గారు చేయాలి. సినిమాలో అందరి కంటే మొదట నేరేషన్ ఇచ్చింది ఆయనకే. ఆయనకు ఆ పాత్ర బాగా నచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల, బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయారు. ఈ విషయంలో ఆయన చాలా ఫీల్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన ఫోన్ చేసి నేను శ్రీలంకలో ఉన్నాను. నాకు నిద్ర పట్టట్లేదు. నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు చెప్పిన కథే గుర్తొస్తుంది. నా రోల్, నీ నేరేషన్ గుర్తొస్తుంది. మనం పక్కా ఒక సినిమా చేద్దాం. నువ్వు డైరెక్షన్ చెయ్యి నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి తర్వాత నాకు అడ్వాన్స్ ఒక చెక్ కూడా ఇచ్చారు ఫిబ్రవరిలోనే.
అప్పటికి లిటిల్ హార్ట్స్ షూటింగ్ ఇంకా హాఫ్ మాత్రమే అయింది. అయినా ఆయన నన్ను నమ్మి ఇచ్చారు. నా నెక్స్ట్ సినిమా ఆయనతోనే చేస్తాను అని తెలిపారు. దీంతో సాయి మార్తాండ్ ని అభినందిస్తుండగా జగపతి బాబు నిర్మాతగా ఈ డైరెక్టర్ కోసం మారడం, మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే అడ్వాన్స్ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటున్నారు.
Also Read : Mahesh Babu : మహేష్ బాబు దెబ్బకి ఒక్కసారిగా భారీగా పెరిగిన సేల్స్.. ఇది కదా మహేష్ రేంజ్ అంటే..