జగన్ తాతయ్యగా జగపతి‌బాబు

యాత్ర సినిమాలో వై.ఎస్.రాజారెడ్డి క్యారెక్టర్ చేస్తున్న జగపతిబాబు లుక్ రిలీజ్

  • Publish Date - January 3, 2019 / 07:50 AM IST

యాత్ర సినిమాలో వై.ఎస్.రాజారెడ్డి క్యారెక్టర్ చేస్తున్న జగపతిబాబు లుక్ రిలీజ్

వై.ఎస్.రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.ఆర్ పాత్రలో నటిస్తున్న సినిమా, యాత్ర.. 70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, ఆనందోబ్రహ్మ ఫేమ్, మహి వి.రాఘవ్ డైరెక్షన్‌లో, విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న యాత్ర టీజర్‌కీ, ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలకీ మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్‌గా, ఈ సినిమాలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి తండ్రి, వై.ఎస్.రాజారెడ్డి క్యారెక్టర్ చేస్తున్న జగపతిబాబు లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.
తన ఒరిజినల్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌తోనే, సీమ పౌరుషానికి ప్రతీక అయిన మీసాలను మెలేసి, ఖద్దర్ డ్రెస్‌లో, నమస్కరిస్తున్న రాజారెడ్డి లుక్ చాలా బాగుంది. హీరో నుండి విలన్‌గా మారి, ఢిఫరెంట్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతున్న జగ్గూ భాయ్, రాజారెడ్డిగా అచ్చు గుద్దినట్టు సరిపోయాడు. సుధీర్ బాబు, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిగా, సీనియర్ నటి సుహాసిని, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డిగా నటిస్తున్న యాత్ర, ఫిబ్రవరి 8న, వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఈ సినిమాకి సంగీతం : కె (కృష్ణ కుమార్), సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్, ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్ 

వాచ్ యాత్ర టీజర్…