హృతిక్, టైగర్ డ్యాన్స్ విశ్వరూపం..

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్.. 'వార్' నుండి 'జై జై శివ్‌శంకర్' వీడియో సాంగ్ రిలీజ్..

  • Publish Date - September 21, 2019 / 08:15 AM IST

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్.. ‘వార్’ నుండి ‘జై జై శివ్‌శంకర్’ వీడియో సాంగ్ రిలీజ్..

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్.. ‘వార్’.. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్‌గా వార్ నుండి ‘జై జై శివ్‌శంకర్’ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.. ఈ పాటలో హృతిక్, టైగర్ ఇద్దరూ డ్యాన్స్‌లో విశ్వరూపం చూపించారు.

విశాల్ – శేఖర్ ట్యూన్‌కు కుమార్ లిరిక్స్ రాయగా, విశాల్ అండ్ బెన్నీ దయాల్ పాడారు.. బాస్కో – సీజర్ అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేశారు. హృతిక్ ఎప్పటిలానే తన స్టైల్‌లో కష్టమైన స్టెప్స్‌ను కూడా అవలీలగా వెయ్యగా, టైగర్ ఎనర్జిటిక్‌గా మూమెంట్స్ చేశాడు. అశుతోష్ రాణా, దీపానిత శర్మ, అనుప్రియ గోయెంకా తదితరులు కీలక పాత్రల్లో నటించిన వార్.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ విడుదల కానుంది.

Read Also : అక్టోబర్ 5న చాణక్య

మ్యూజిక్ : విశాల్ – శేఖర్, బ్యాగ్రౌండ్ స్కోర్ (ట్రైలర్) : జాన్ స్టెవార్ట్, సినిమాటోగ్రఫీ : బెంజమిన్ జాస్పర్, ఎడిటింగ్ : ఆరిఫ్ షేక్, స్టోరీ : ఆదిత్య చోప్రా, సిద్ధార్థ్ ఆనంద్, స్క్రీన్‌ప్లే : శ్రీధర్ రాఘవన్, సిద్ధార్థ్ ఆనంద్.