Jalsa Special Show: రీ-రిలీజ్‌లోనూ దుమ్ములేపిన పవన్ కళ్యాణ్.. జల్సా చేసుకున్న ఫ్యాన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ చిత్రాన్ని అభిమానులు పవన్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో స్పెషల్ షోలు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా జల్సా చిత్రానికి స్పెషల్ షోలు పడటంతో ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

Jalsa Spcial Show Collections Are Outstanding

Jalsa Spcial Show: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ చిత్రాన్ని అభిమానులు పవన్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో స్పెషల్ షోలు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా జల్సా చిత్రానికి స్పెషల్ షోలు పడటంతో ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమాను 2008లో రిలీజ్ చేయగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Jalsa Special Show: రికార్డు క్రియేట్ చేసిన జల్సా స్పెషల్ షో.. క్రేజ్ కా బాప్!

తాజాగా ఈ సినిమా మరోసారి తన సత్తా చాటింది. పవన్ అభిమానులకు ఎంతో ఇష్టమైన ఈ చిత్రం స్పెషల్ ఫోలకు కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. అక్కడా.. ఇక్కడా.. అనే తేడా లేకుండా, రీ-రిలీజ్ అయిన అన్ని చోట్లా ఈ సినిమాకు అభిమానులు పోటెత్తారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి తన స్టామినా ఏమిటో చూపించింది. ఈ సినిమాకు వరల్డ్‌వైడ్‌గా రూ.3.25 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Jalsa Special Shows: పోకిరి రికార్డును లేపేసిన జల్సా.. ఏంది సామీ ఈ క్రేజ్?

ఇలా ఓ రీ-రిలీజ్ సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం నిజంగా విశేషం. ఇక ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో చూసేందుకు పవన్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో పవన్ మేనియాతో ‘జల్సా’ చేశారు ఫ్యాన్స్. ఈ సినిమా స్పెషల్ షోలతో ఆయనకు అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు అభిమానులు. మున్ముందు రీ-రిలీజ్ సినిమాలు ఎలాంటి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తాయో చూడాలి.