నెల్లూరులో నన్ను చూడ్డానికి జనం వస్తారా?అనుకున్నా!..

Pawan Kalyan Exclusive Interview: సెప్టెంబర్ 2 జనసేన పార్టీ వ్యవస్థాపకులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, జనసైనికులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. జనసైనికులు చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలుసుకున్న పవన్ వారిని అభినందించారు. అలాగే తాజా ఇంటర్వూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.పుట్టినరోజున వదిన డబ్బులిస్తే పుస్తకాలు కొనుక్కునేవాణ్ణి..
నాకు చిన్నప్పటినుంచి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకో ఇష్టముండదు. స్కూల్లో ఒకటి, రెండు సార్లు చాక్లెట్లు పంచినట్టు గుర్తు.. అసలు నాకు కానీ ఇంట్లో వాళ్లకు కానీ గుర్తుండదు.. ఒకవేళ రెండురోజుల తర్వాత గుర్తొస్తే.. అప్పుడు, అరే.. పుట్టినరోజు మర్చిపోయామే అనేవారు. అప్పుడు వదిన డబ్బులిస్తే పుస్తకాలు కొనుక్కునేవాణ్ణి..సినిమాల్లోకి వచ్చిన తరువాత స్నేహితులు, నిర్మాతలు పుట్టిన రోజు వేడుకలు చేస్తే ఇబ్బందిగా అనిపించేది.కేక్ కట్ చేయడం ఆ కేక్ నా నోట్లో పెట్టడం అది నాకు ఎబ్బెట్టుగా అనిపించేది.
అంతే తప్ప ప్రత్యేక కారణాలు ఏమీ లేవు. నా గురించి నేను పెద్దగా ఆలోచించను, అలాగే పెద్దగా ఊహించికోను..నెల్లూరులో పెరుగుతున్నప్పడు ఎలాంటి మధ్య తరగతి ఆలోచనా దృక్పథంతో ఉన్నానో ఇప్పుడూ కూడా అదే జీవనం సాగిస్తున్నాను. నన్ను లక్షలాది మంది అభిమానించడం, ఆదరించడం చూస్తుంటే నాకు ఆశ్చర్యమనిపిస్తు వుంటుంది.నెల్లూరులో నాకోసం అంతమంది రావడం చూసి ఆశ్చర్యపోయాను..
సుస్వాగతం టైంలో కర్నూలులో రోడ్ షో కి విపరీతమైన జనం వచ్చారు.ఇంతమంది నాకోసం వచ్చారా? వీళ్ళకీ నాకు తేడా లేదు.. వాళ్ళు అటు వైపు వున్నారు నేను ఇటు వైపు వున్నాను అంతే అనుకున్నాను.. అటువంటి ఆలోచన వచ్చింది తప్ప వాళ్ళు నన్ను ప్రత్యేకంగా చూస్తున్నారు అనే ఆలోచన విధానం ఎప్పుడు లేదు.అది జన సైనికులు, వీర మహిళలు, అభిమానుల గొప్పతనం..
నా ప్రమేయం లేకుండా నా పుట్టినరోజు సంధర్భంగా సేవా వారోత్సవాలు చేస్తున్నారంటే అది జన సైనికుల, వీర మహిళల గొప్పతనం.
వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదములు. ఒక వ్యక్తి మీద వున్న అభిమానం సమాజానికీ ఉపయోగపడితే నిజంగా తృప్తిగా వుంటుంది. ఇందుకుభగవంతుడికి ధన్యవాదాలు తెలియ తెలుపుతున్నాను..