Jani Master : జానీ మాస్ట‌ర్‌కు షాకిచ్చిన జ‌న‌సేన పార్టీ..

ప్ర‌ముఖ‌ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌కు జ‌న‌సేన పార్టీ షాకిచ్చింది.

Janasena party shocked to Johnny Master

ప్ర‌ముఖ‌ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌కు జ‌న‌సేన పార్టీ షాకిచ్చింది. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని ఆదేశించింది. ఆయ‌న పై రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయిన క్ర‌మంలో పార్టీ నాయ‌క‌త్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలిపింది. త‌క్ష‌ణ‌మే ఈ నిర్ణ‌యం అమ‌లులోకి వ‌చ్చిన‌ట్లుగా పేర్కొంది. ఈ మేర‌కు జ‌న‌సేన పార్టీ ఓ ప్ర‌క‌ట‌న ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

ఏం జ‌రిగిందంటే..?

ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్ట‌ర్ పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసింది. అవుట్‌ డోర్ షూటింగ్స్ లో జానీ మాస్టర్ తనపై పలు మార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. నార్సింగి పోలీసులు దీనిపై కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేప‌ట్టారు.

Movie Shooting Updates : ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది..? ఫౌజీ, మట్కాల సంగ‌తేంటి?

2017లో డీషోలో జానీ మాస్టర్ తో త‌న‌కు ప‌రిచ‌మైంద‌ని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. అనంత‌రం జానీ మాస్టర్ టీమ్ నుండి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ ఫోన్ రావడంతో 2019లో అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్‌గా జాయిన్ అయిన‌ట్లు వెల్ల‌డించింది. ఓ షో కోసం జానీ మాస్ట‌ర్‌తో పాటు మ‌రో ఇద్ద‌రితో క‌లిసి ముంబైకి వెళ్ల‌గా అక్క‌డ ఓ హోట‌ల్‌లో త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాని అని తెలిపింది.

ఆ సంఘ‌ట‌న త‌రువాత‌ విషయాన్ని బయటికి ఎవరికి చెప్పొద్దూ అంటూ బెదిరించారని, పలుమార్లు షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ చెప్పినట్లు వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడ‌ని అంది. మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం కూడా చేసాడని ఫిర్యాదులో పేర్కొంది.

Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..?