Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..?
అయిదుగురు కంటెస్టెంట్స్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఫైనల్ లో పోటీ పడబోతున్నారు.

Aha Telugu Indian Idol Season 3 get into Finals Five Contestants going to Compete
Telugu Indian Idol Season 3 : ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ గా సాగుతుంది. దాదాపు 15,000 మంది సింగర్స్ ని ఆడిషన్స్ చేసి ఫైనల్ గా 12 మందిని సెలెక్ట్ చేసి ఈ సీజన్ స్టార్ట్ చేసారు. పలు ఎపిసోడ్స్ లో స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చి ఇంట్రెస్టింగ్ గా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3ని ఎంటర్టైన్మెంట్ గా, ఆసక్తిగా నడిపించారు.
ఫైనల్ గా 28 ఎపిసోడ్‌ల తర్వాత గ్రాండ్ ఫైనల్ పోటీ జరగనుంది. 12 మంది కంటెస్టెంట్స్ లో ఏడుగురు ఎలిమినేట్ అవ్వగా ఫైనల్ కి ఐదుగురు కంటెస్టెంట్స్ మిగిలి ఉన్నారు. అనిరుధ్ సుస్వరం, స్కంద, కీర్తన, శ్రీ కీర్తి, నసీరుద్దీన్.. ఈ అయిదుగురు కంటెస్టెంట్స్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఫైనల్ లో పోటీ పడబోతున్నారు.
ఫైనల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 20, 21 తేదీల్లో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా ఫైనల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఇక ఫైనల్ ఎపిసోడ్ కోసం జడ్జీలుగా వ్యవహరిస్తున్న తమన్, గీతా మాధురి, కార్తీక్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చారు. మరి ఫైనల్ లో ఈ అయిదుగురు కంటెస్టెంట్స్ లో ఎవరు విజేతగా నిలుస్తారో, తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్ ఎవరు అవుతారో చూడాలి. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ ఫైనల్ ప్రోమో మీరు కూడా చూసేయండి..