బాబాయ్ పాటకు జాన్వీ డ్యాన్స్.. వీడియో వైరల్..

  • Publish Date - September 21, 2020 / 07:34 PM IST

Janhvi Kapoor And Angad Bedi Dance: అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ తల్లిలాగే నటిగానే కాకుండా మంచి డ్యాన్సర్‌‌గానూ పేరు తెచ్చుకుంది. ఇప్పటికే చాలాసార్లు తను డ్యాన్స్ చేసిన వీడియోలను సోషల్‌‌ మీడియాలో షేర్‌ చేసిందామె. తాజాగా జాన్వీ ‘గుంజన్‌ సక్సేనా’ మూవీలో తనకు సోదరుడిగా నటించిన అంగద్‌ బేడీతో కలిసి స్టెప్పులు వేసింది.

ఈ వీడియోను అంగద్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘‘ఎవరూ చూడని డ్యాన్స్‌. అనిల్ కపూర్ సర్‌.. ఈ పాట మీకు అంకితం. మా చిత్రం గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ నుంచి రిహార్సల్ దృశ్యం’ అంటూ పోస్టు చేసిన ఈ వీడియోలో వీరిద్దరూ అనిల్‌ కపూర్‌ సూపర్‌ హిట్‌ సాంగ్ ‘మై నేమ్‌ ఈజ్‌ లఖన్‌’ (Ram Lakhan) అనే పాటకు డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.