Janhvi Kapoor comes out to support Allu Arjun pushpa 2 movie
Janhvi Kapoor : సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2 సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో తెలిసిందే. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. మొదటి రోజు నుండే కాసుల వర్షం కురిపిస్తుంది పుష్ప 2. ఇప్పటికే పుష్ప 1 భారీ విజయాన్ని అందుకోగా ఇప్పుడు పుష్ప 2 దానికి మించిన సక్సెస్ తో దూసుకుపోతుంది.
Also Read : Fear title song : వామ్మో.. భయపెట్టేలా వేదిక.. ఫియర్ టైటిల్ సాంగ్ వచ్చేసింది..
అయితే తాజాగా పుష్ప 2 సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. కాగా పుష్ప సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడంతో ఎక్కువ స్క్రీన్స్ అవసరమయ్యాయి. ఇందుకు గాను హాలీవుడ్ మూవీ ఇంటర్‌స్టెల్లార్ రీ రిలీజ్ కోసం కేటాయించిన పలు ఐమాక్స్ థియేటర్లను కూడా పుష్ప 2 సినిమాకి ఇచ్చేసారు. దీంతో కొందరు పుష్ప 2 సినిమా కంటే ఇంటర్‌స్టెల్లార్ సినిమానే బాగుంటుందని, ఈ సినిమాకి థియేటర్స్ ఇచ్చి ఉంటే బాగుండేదని పుష్ప 2 పై తీవ్ర స్థాయిలో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు.
కాగా దీనిపై స్పందించింది జాన్వీ.. ” పుష్ప 2 కూడా సినిమానే కదా.. ఎందుకు వేరే సినిమాలతో పోలుస్తూ మన తెలుగు సినిమాని, మన దేశాన్ని ఎందుకు తక్కువ చేస్తూ అవమానిస్తున్నారు అంటూ మండిపడింది. మీరు ఏదైతే హాలీవుడ్ సినిమాల కోసం మన సినిమాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారో వారే మన భారతీయ సినిమాలని పొగుడుతున్నారు. కానీ మనం మాత్రం ఇంకా మన సినిమాలను తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకుంటున్నాం. చాలా బాధగా ఉంది” అంటూ జాన్వీ వారిపై ఫైర్ అయ్యింది.