శ్రీదేవి కూతురా.. మజాకా – జాన్వీ డ్యాన్స్ చూశారా!

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో వైరల్..

  • Publish Date - February 25, 2020 / 12:24 PM IST

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో వైరల్..

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ తల్లి నుంచి అందంతోపాటు అభినయాన్ని అందిపుచ్చుకుంది. కథానాయికగా నటించిన మొదటి సినిమాకే (ధడక్‌) జాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. జాన్వీ ప్రస్తుతం ‘తఖ్త్‌’ సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీలోని ఓ సన్నివేశం కోసం డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న జాన్వీ .. ఆ  వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

దేవానంద్, వహీదా రెహమాన్ వంటి లెజెండ్స్ నటించిన మ్యూజికల్ హిట్ ‘గైడ్’ చిత్రంలోని ‘పియా తోసే నైనా లాగే రే’ అనే పాటకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న జాన్వీ వహీదాను మ్యాచ్ చేసేలా స్టెప్స్ వేసిందని నెటిజన్స్ పొగుడుతున్నారు. నిజంగా మంచి ఈజ్, ఎనర్జీతో చక్కగా మూమెంట్స్ చేసింద జాన్వీ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘తఖ్త్’ చిత్రాన్ని కరణ్‌ జోహర్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా, రణ్‌వీర్‌ సింగ్‌, ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. 2021 డిసెంబర్‌లో క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. మొగలుల కాలం నాటి చారిత్రక కథాంశంతో  తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం జాన్వీ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో నటిస్తోంది.